Lord Sri Rama Kalyanam: 12 గంటలకే ఎందుకు శ్రీ రాముని కల్యాణం చేస్తారు? దైవ రహాస్యమా?

Why Lord Sri Rama Kalyanam Muhurtham On Midday 12 O Clock: శ్రీరాముడి కల్యాణం కమనీయంగా సాగుతుంది. దేదీప్యమానంగా జరిగే ఆ కల్యాణం చూడాలంటే రెండు కళ్లు చాలవు. అంతటి ప్రాశస్త్యం ఉన్న కల్యాణానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ కల్యాణం ముహూర్తం వెనుక రహాస్యం ఏమిటో తెలుసా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 6, 2025, 12:11 PM IST
Lord Sri Rama Kalyanam: 12 గంటలకే ఎందుకు శ్రీ రాముని కల్యాణం చేస్తారు? దైవ రహాస్యమా?

Sri Rama Kalyanam Muhurtham: లోకాభిరాముడు.. ప్రజా క్షేమం కోరే కాముకుడు.. ధర్మానికి ప్రతీకగా నిలిచే శ్రీరాముడు జీవితం మొత్తం ఎన్నో విశేషాలు.. అద్భుతాలు ఉన్నాయి. ఇక శ్రీరామనవమి అంటే రాముడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. యావత్‌ హిందూ భక్త జనం శ్రీరామనవమిని పండుగలా చేసుకుంటారు. ఈరోజు శ్రీరాముడు తన పట్టమనిషిగా సీతను చేసుకుంటాడు. సీతారాముల కల్యాణం ఎంతో కమనీయంగా సాగుతుంది. అయితే సీతారాముల కల్యాణం ఎప్పుడూ ఒకటే ముహూర్తాన జరుగుతుంది. సంవత్సరాలు గడిచినా కూడా సీతారాముల కల్యాణ ఘడియ ఒకటే ఉంటుంది. ఎందుకలా..? ఏమిటి ఆ విశేషాలు అనేది తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Lord Sri Rama Qualities: శ్రీరాముడి 16 సద్గుణాలు ఏమిటో తెలుసా? ఆ లక్షణాలు మీలో ఉన్నాయా?

శ్రీసీతారాముల కల్యాణం అభిజిత్ లగ్న ముహూర్తంంలో జరుగుతుంటి. శ్రీరామ నవమి సమయంలోనే అభిజిత్‌ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకీ అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటో తెలుసా. రాముడు వసంత రుతువు చైత్రశుద్ద నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు జన్మించాడు. దీనినే అభిజిత్ లగ్నమని అంటారు. అభిజిత్ ముహూర్తం అి అంటారు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని పండుగగా చేసుకుంటారు.

Also Read: Ramayan: రామాయణం ఎందుకు చదవాలి? ఆసక్తికర రహాస్యాలు ఇవే!

చైత్ర శుద్ధ నవమి అనేది శ్రీరాముడి జీవితంలో కీలకమైన ఘట్టాలకు ముఖ్యమైన రోజు. శ్రీరాముడి అన్ని ముఖ్య ఘట్టాలు ఆరోజునే జరగడం విశేషం. శ్రీరాముడి జననం.. కల్యాణం, పద్నాలుగేళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముడి దేవాలయం.. ఆంజనేయ స్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం చైత్ర నవరాత్రి వసంతోత్సవం తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తుండడం విశేషం. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టడంతో మధ్యాహ్న సమయంలోనే శ్రీరామనవమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహం పొందుతారనే నమ్మకం ఉంది. అంతేకాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల్లో విశ్వాసం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News