Lucky Zodiac Signs July 2025: జూలై నెల ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.. ఎందుకంటే ఈ నెలలోనే శ్రావణమాసం కూడా ప్రారంభమవుతుంది. అలాగే అతిపెద్ద గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు లాంటి ఎంతో శక్తివంతమైన గ్రహం రాశి మార్పులు చేయబోతోంది. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాజయోగం జాతకంలో శుభ స్థానంలో ఉంటే వ్యక్తికి సమాజంలో గౌరవం లభించడమే కాకుండా కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా వీరికి విజయాలు వెన్నంటే ఉంటాయి. ముఖ్యంగా పొందలేని అవకాశాలే ఉండవు. అయితే మాలవ్య రాజయోగం జూలై నెలలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలను తెచ్చి పెట్టబోతోంది. ముఖ్యంగా ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగ ప్రభావంతో అత్యంత లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి జులై నెల మొత్తం చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా ఈ నెలలో వీరికి ఏర్పడే ప్రత్యేకమైన శక్తివంతమైన రాజయోగాలు అద్భుతమైన అవకాశాలను అందించబోతున్నాయి. అలాగే వీరికి ఈ నెలలో కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. వారాల్లో కూడా చాలా వరకు కలిసి రాబోతోంది. ముఖ్యంగా వీరు కష్టపడి పనిచేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాలు కూడా ఈ సమయంలో సాధించగలుగుతారు. ఉన్నతాధికారుల నుంచి మంచి సపోర్టు లభించి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ నెలలో ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోయి అద్భుతమైన విజయాల వైపు ముందుకు సాగుతారు. ఏదైనా సమస్యలు ఉన్నవారు తప్పకుండా దగ్గర్లో ఉన్న శివాలయాన్ని సందర్శించి లింగానికి పాలాభిషేకం చేయించండి.
మిథున రాశి
మిధున రాశి వారికి మాలవ్య రాజయోగం వల్ల జూలై నెల ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా వీరికి అన్నిటి పరంగా పురోగతి లభిస్తుంది. డబ్బు సంపాదించడంలో అద్భుతమైన అవకాశాలు కూడా పొందుతారు. ముఖ్యంగా వీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో కూడా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కూడా ఆచితూచి అడుగేస్తారు. ముఖ్యంగా వ్యాపారాలు వస్తున్న ఎలాంటి అడ్డంకులైన తొలగిపోతాయి. ఈ సమయంలో ఎలాంటి ప్రణాళికలు వేసిన సక్సెస్ అవుతారు. అలాగే మీపై మీకు నమ్మకం కూడా పెరిగి కొన్ని రకాల కఠిన తరమైన పనులు చేసి విజయాలు సాధించగలుగుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు కూడా జులై నెలలో అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు. ముఖ్యంగా శుక్రుడి అనుగ్రహం వీరికి లభించి కోరుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు పెద్ద పదవులు పొందగలుగుతారు. అలాగే అనుకున్న చోటుకి బదిలీలు కూడా జరుగుతాయి. వ్యాపారాలు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు స్టాక్ మార్కెట్లలో పెట్టబడులు పెడితే భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ నెలలో ఎలాంటి పనులు ప్రారంభించిన సులభంగా పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి
మాలవ్య రాజయోగం వల్ల సింహ రాశి వారికి కూడా జూలై నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు అర్జించగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా లాభసాటిగా మారబోతోంది. విదేశీ ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ముఖ్యంగా కొత్త ప్రణాళికలతో వ్యాపారాలు ప్రారంభించే వారు సక్సెస్ అవుతారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఎప్పటినుంచో ఫర్నిచర్ ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయాలని వారికి ఈ సమయంలో మంచి ఛాన్సులు వస్తాయి. దీనివల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









