IPL 2025: సంజీవ్ గోయెంకా సంచలన నిర్ణయం! LSG జట్టులో 4 పెద్ద మార్పులు.. ఆ ప్లేయర్ అవుట్...!!

IPL 2025: ఐపీఎల్  18వ సీజన్ ముగిసి పట్టుమని రెండు రోజులైనా కాలేదు. అప్పుడే కొన్ని జట్లు కోచింగ్ సిబ్బంది మార్చే పనిలో బిజీగా మారారు. వరుసగా రెండుసార్లు సీజన్లలో నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్ తన టీమ్ లో మార్పులకు సిద్ధం అవుతోంది.   

Written by - Bhoomi | Last Updated : Jun 5, 2025, 12:10 PM IST
IPL 2025: సంజీవ్ గోయెంకా సంచలన నిర్ణయం! LSG జట్టులో 4 పెద్ద మార్పులు.. ఆ ప్లేయర్ అవుట్...!!

Lsg Owner Sanjiv Goenka: కెప్టెన్ కెఎల్ రాహుల్ తో జట్టు నిర్వహణ సమస్యల కారణంగా లక్నో సూపర్ జెయింట్స్  జట్టును పూర్తిగా మార్చాల్సి వచ్చింది. గతేడాది  జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొంతమంది మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది . అయితే, ఈ ఏడాది  కూడా వారు ట్రోఫీని గెలవలేకపోయారు. ఈ సంవత్సరం ఆడిన 14 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లలో మాత్రమే వారు గెలిచారు. ప్రారంభంలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, సీజన్ చివరి నాటికి వారు 7వ స్థానంలో ఉన్నారు. దీని కారణంగా, జట్టు యజమాని సంజీవ్ గోయెంకా జట్టులో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

Add Zee News as a Preferred Source

తమ ఫ్రాంచైజీ నిరుడు, ఈ ఏడాది ప్లే ఆఫ్స్ కు చేరకపోవడంతో చైర్మన్ సంజీవ్ గొయోంకా అసంతృప్తిగా ఉన్నాడ‌ట‌. సో..కోచింగ్ స్టాఫ్ లోని కొందరిపై వేటు తప్పదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీళ్లలో మెంటార్ జహీర్ ఖాన్ పేరు కూడా ఉండే అవకాశం ఉందని లక్నో వర్గాలు చెబుతున్నాయి. టీమిండియా 2011లో వరల్డ్ కప్ గెలుపొందిన తర్వాత జట్టులో సభ్యుడైన జహీర్ ఖాన్ నిరుడు లక్నో కోచింగ్ యూనిట్లో చేరాడు. హెడ్ కోచ్ జస్టిస్ లాంగర్ తో కలిసి మెంటార్ గా వ్యూహరచనలు చేశాడు మాజీ పేసర్.  అయితే 18వ సీజన్ లక్నో తీవ్రంగా నిరాశపరిచింది. ఆరంభంలో అదుర్స్ అనిపించినా కీలక మ్యాచుట్లో మాత్రం ఓడిపోయింది. 14 మ్యాచుల్లో 6 విజయాలతో ప్లేఆఫ్స్ బెర్తుకు దూరం అయ్యింది. 

Also Read: 10-Star Hotel: ప్రపంచంలోని సగం మందికి ఈ 10 స్టార్ హోటల్ గురించి తెలియదు.. ఒక నైట్ ఉండాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!!  

వేలంలో రికార్డు ధర పలికిన కెప్టెన్ రిషభ్ పంత్ ఆఖరి మ్యాచులో సెంచరీ మినహా పెద్దగా రాణించినట్లు అనిపించలేదు. అతన్ని సానబెట్టడంలో మెంటార్ గా జహీర్ ఖాన్ విఫలమయ్యాడని సంజీవ్ గొయోంకా భావిస్తున్నారు. అయితే ఈ సీజన్ లో భయం లేకుండా చెలరేగి ఆడాలని అనుకన్న లక్నో మైదానంలో మాత్రం తేలిపోయింది. మరోవైపు హిట్టర్ నికోలస్ పూరన్, మిడిలార్డర్ లో సమద్ తేలిపోవడంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి. దాంతో వచ్చే సీజన్ కు పక్కగా సిద్ధం కావాలనే ఆలోచనతో ఉన్న ఆయన కొత్త మెంటార్ కోసం చూస్తున్నాడని తెలుస్తోంది. అదే నిజం అయితే లక్నో మెంటార్ గా జహీర్ పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుందని చెప్పవచ్చు. 

Also Read: RCB: ఆర్సీబీకి మైండ్‌ బ్లాక్.. ఐపీఎల్ 2025 ట్రోఫీ వెనక్కి ఫిక్స్? కారణం ఇదే...!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News