WTC Final Interesting Facts: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 5 ఆసక్తికర విషయాలు
5 Interesting Facts about WTC Final: గత 18 ఏళ్లలో ఐసీసీ ఈవెంట్లలో ఏ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధించలేదు. చివరగా గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే వరల్డ్ కప్‌లో కివీస్‌ను టీమిండియా ఓడించింది.
5 Interesting Facts about WTC Final : యూకేలోని సౌతాంప్టన్‌లో మరికాసేపట్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. జూన్ 18 నుంచి జూన్ 22 తేదీల మధ్య నిర్వహించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే వర్షం ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్, టీమిండియాలు ఐసీసీ ఈవెంట్లలో చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో తలపడ్డాయి. విజయం సాధించిన కివీస్ ఫైనల్ చేరుకుంది. తాజాగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తొలి సెషన్ వర్షార్పణం అయింది.
- గత 18 ఏళ్లలో ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధించలేదు. చివరగా గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే వరల్డ్ కప్‌లో కివీస్‌ను టీమిండియా ఓడించింది.
- వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC Final 2021)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ అజింక్య రహానే. భారత వైస్ కెప్టెన్ 43.80 సగటుతో 1095 పరుగులు చేశాడు.
Also Read: Team India Squad For WTC Final: ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు టీమిండియాను ప్రకటించిన BCCI
- డబ్ల్యూటీసీ ప్రారంభమయ్యాక న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కేన్ విలియమ్సన్. కివీస్ కెప్టెన్ 58.35 సగటుతో 817 పరుగులు చేశాడు.
- వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (Ravichandran Ashwin) నిలిచాడు. 21 కన్నా తక్కువ సగటుతో అశ్విన్ 67 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలు చెరో 36 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
- వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పేసర్ టిమ్ సౌతీ న్యూజిలాండ్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కివీస్ ఫాస్ట్ బౌలర్ 20.66 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ తరువాత సైతం అశ్విన్ వికెట్లను సౌథీ దాటే అవకాశం లేదు.
Also Read: Mohammad Azharuddin: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌పై వేటు, షోకాజ్ నోటీసులు జారీ
- టెస్టుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. నేడు ప్రారంభమయ్యేది తొలి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్. ఈ టెస్టుకు రిజర్వ్ డే సైతం కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook