close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

స్వల్ప లక్ష్యమైనప్పటికీ.... సౌతాఫ్రికాను వణికిస్తున్న వరణుడు !

సాధారణంగా క్రికెట్ లో ఒక జట్టుకు మరో  జట్టు వణికిస్తుంది. అయితే ఇక్కడ సౌతాఫ్రికా పరిస్థితి భిన్నం. ఇతర జట్ల కంటే ఆ జట్టుకు వరణుడు వణికిస్తున్నాడు.

Updated: Jun 15, 2019, 11:08 PM IST
స్వల్ప లక్ష్యమైనప్పటికీ.... సౌతాఫ్రికాను వణికిస్తున్న వరణుడు !

సాధారణంగా క్రికెట్ లో ఒక జట్టుకు మరో  జట్టు వణికిస్తుంది. అయితే ఇక్కడ సౌతాఫ్రికా పరిస్థితి భిన్నం. ఇతర జట్ల కంటే ఆ జట్టుకు వరణుడు వణికిస్తున్నాడు. భారీ అంచనాలతో  వర ల్డ్  కప్ టొర్నీలో అడుగుపెట్టి సఫారీ జట్టుకు ఆరంభం నుంచి నిరాశే ఎదురౌతోంది. తొలి మూడు మ్యాచ్ లు ఓడిన సౌతాఫ్రికాకు మిగిలిన లీగ్ మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే తమ కంటే బలహీనమైన విండీస్ తో మ్యాచ్ ..ఈ మ్యాచ్ లో గెలిచి తొలి విజయాన్ని ఖాతాలోవేసుకోవాలని భావించింది. అయితే అది కాస్త వర్షం కారణంగా రద్దయింది. దీంతో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచుల్లో (ఇంగ్లండ్, బంగ్లా, భారత్ ) పై ఓడిపోవడం.. ఒక మ్యాచ్ రద్దు కావడంతో కేవలం ఒకే ఒక పాయింట్ తో పాయింట్ల పట్టికగా అట్టడుగు స్థానంలో నిలిచింది. మొత్తం ఆడిన మ్యాచులో ఇప్పటి వరకు సఫారీ జట్టు గెలుపు రుచి చూడాలేదు. అయితే పసికూక ఆఫ్ఘాన్ తోనైనా విజయం సాధించి జైత్రయాత్ర ప్రారంభించాలని ఆ జట్టు కసిగా ఆట ఆరంభించింది.

సరిగ్గా ఇదే సమయంలో వర్షం రూపంలో దురదృష్టం ఆ జట్టుకు మళ్లీ వెంటాడోతోంది. కార్డిఫ్ వేదికగా జరగుతున్న సౌతాఫ్రికా - ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలవడంతో ఆట నిలిపివేశారు. కాసేపటికి వర్షం తగ్గుముఖం పట్టడం మ్యాచ్ మళ్లీ ప్రారంభించారు. అయితే  మ్యాచ్ ను 48 ఓవర్లకు కుదించారు. ఇలా మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించిన ఆప్షాన్ 34.1 ఓవర్లు ఆడి 125 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికాకు ఇది స్పల్ప లక్ష్యమైనప్పటికీ  వరుణుడు భయం వెంటాడుతుంది. ఒక వేళ మళ్లీ వర్షం కురిసి మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోతే మళ్లీ చెరోపాయింట్ పంచుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి ప్రతి మ్యాచ్ లో గెలిచి తీరితేనే ఆ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశాలున్న పరిస్థితిలో  ఉంది. స్వల్ప లక్ష్యాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా సఫారీ జట్టు చేధిస్తుందా లేదా అనేది దానిపై ఉత్కంఠత నెలకొంది.