IPL 2025 Hyderabad Matches: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు పోటెత్తుండడంతో ఈ క్రీడా సంబరానికి పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘంతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏర్పాట్లు చేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బీసీసీఐ నిధులతో స్టేడియం కొత్త రూపు సంతరించకుంది. ప్రేక్షకులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.
Also Read: Bumper Bonanza: ఐపీఎల్ బంపర్ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం
ఉప్పల్‌లో సన్‌రైజర్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌తో హైదరాబాద్‌లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కీలక వివరాలు వెల్లడించారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్టు సీపీ ప్రకటించారు.
Also Read: IPL Uppal Stadium: కొన్ని రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం ఎలా ఉందో చూద్దాం
వివిధ విభాగాలకు చెందిన 2,700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తుతో ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ఉప్పల్ స్టేడియం 39,000 మంది సిట్టింగ్ సామర్థ్యం ఉండగా.. స్టేడియం పరిసరాల ప్రాంతాల్లో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో అన్ని చర్యలు తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజలు పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్లాలని ప్రేక్షకులకు పోలీస్ శాఖ సూచిస్తోంది.
ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టినట్టు తెలిపారు. మ్యాచ్ మధ్యలో ఎవరూ స్టేడియంలోకి రావద్దని సూచించారు. ఎవరైనా వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బస్సులు, మెట్రో రైళ్ల సమయాల్లో మార్పులు చేయడం విశేషం.
అనుమతి నిషేధం
ఉప్పల్ స్టేడియంలోకి లాప్‌టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హెల్మెట్స్, బ్యాగ్స్, బయటఫుడ్ నిషేధం. ప్రేక్షకులు ముందే గ్రహించి వాటిని తీసుకురావద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









