)
Kabaddi League: కబడ్డీ క్రీడను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సరికొత్త సీజన్‌కు సర్వం సిద్ధమైంది. విశాఖపట్టణం వేదికగా దేశీయ కబడ్డీ లీగ్ ప్రారంభం కానుండగా ఈవెంట్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ క్రీడా దినోత్సవాన వైజాగ్‌లో కబడ్డీ పండగ ప్రారంభం కానుంది. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరుకానున్నాయి. పీకేల్ కొత్త సీజన్ విశేషాలు ఇలా ఉన్నాయి.
కోట్లాది మంది కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఆరంభ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ ఢీ కొట్టనుంది. ఈసారి వినూత్న మార్పులతో సరికొత్త ఉత్సాహం, ఉత్కంఠమైన పోరాటాలతో ఈ సీజన్ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఏడేళ్ల తర్వాత వైజాగ్‌కు ఈ లీగ్ తిరిగి వస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం రోజున ప్రారంభం కానుండడంతో పెద్ద స్థాయిలో క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు, ఫేవరెట్ అయిన తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది. రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు వైజాగ్‌లోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్నాయి. కొత్త సీజన్ కు శ్రీకారం చుడుతూ గురువారం వరుణ్ బీచ్‌లోని నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమం క్రీడాకారులు, నిర్వాహకుల ఉత్సాహంతో నిండిపోయింది.
ఈ కార్యక్రమానికి మషాల్ స్పోర్ట్స్ బిజినెస్ హెడ్, ప్రో కబడ్డీ లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి, తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్, తమిళ్ తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ సహా మొత్తం 12 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. ‘మరో సీజన్‌తో తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అభిమానులను ఆటకు మరింత చేరువ చేసేలా రూపొందించిన సరికొత్త ఫార్మాట్‌తో తిరిగి వస్తున్నాం. ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం పెరగడంతో ఈ సీజన్లో పోటీ తీవ్రత అధికం కానుంది. విరామం తర్వాత అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైజాగ్‌కు లీగ్ తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.