అంబటి రాయుడుకి హైదరాబాద్ జట్టు పగ్గాలు

అంబటి రాయుడుకి హైదరాబాద్ జట్టు పగ్గాలు

Last Updated : Sep 15, 2019, 01:32 PM IST
అంబటి రాయుడుకి హైదరాబాద్ జట్టు పగ్గాలు

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, ఆ తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 11 వరకు బెంగళూరు వేదికగా జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు అంబటికి ఏకంగా కెప్టేన్సీ బాధ్యతలే అప్పగించారు. బి.సందీప్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ అనంతరం అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన అంబటి రాయుడిని తిరిగి మనస్సు మార్చుకునేలా చేయడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సెలెక్టర్ నోయెల్ డేవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు.

రిటైర్ మెంట్ ప్రకటన అనంతరం అంబటి రాయుడుని ఓదార్చిన తాము.. ప్రస్తుతం నీ వయస్సు 33 ఏళ్లేనని.. నీలో మరో ఐదేళ్లపాటు క్రికెట్ ఆడే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని చెప్పామన్నారు. కనీసం నీ సొంత రాష్ట్రం కోసమైనా నువ్వు మళ్లీ క్రికెట్ ఆడాలని సూచించడం వల్లే అంబటి రాయుడు మనసు మార్చుకున్నట్టు నోయెల్ డేవిడ్ తెలిపాడు.

More Stories

Trending News