)
Anaya Bangar Surgery: రియాలిటీ షోలో తన లింగాన్ని మార్చుకున్న అనయ బంగర్ తన కోరికను బహిర్గతం చేశారు. తల్లి కావాలనే గొప్ప కోరికతో తాను లింగ మార్పిడి చేయించుకున్నట్లు ఆమె చెప్పారు. ఆ మాట ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇటీవల 'రైజ్ అండ్ ఫాల్' అనే రియాలిటీ షోలో కనిపించిన సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్.. తన లింగ మార్పిడికి గల ప్రధాన కారణాన్ని తెలియజేసింది. తల్లి కావాలనే తన కలను వెల్లడించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అబ్బాయిగా జన్మించిన అనయ తరువాత లింగ పరివర్తనకు గురై ఇప్పుడు లింగమార్పిడి మహిళగా జీవిస్తోంది. ఆమె షోలో ఆరుష్ భోలాతో మాట్లాడినప్పుడు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అతిపెద్ద సీక్రెట్ ను బయటపెట్టింది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
అనయ బంగర్ మాట్లాడుతూ.. "నేను తల్లి కావడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది బిడ్డను దత్తత తీసుకోవడం, రెండవది సరోగసీ ద్వారా తల్లి కావడం, ఎందుకంటే హార్మోన్ చికిత్సకు ముందు నా స్పెర్మ్ స్తంభింప చేశారు" అని స్పష్టంగా చెప్పింది. ఆమె ఇంకా ఇలా చెప్పింది. "నేను గర్భం దాల్చలేకపోతున్నాను. కాబట్టి, సరోగసీ ద్వారా నా తల్లి కల కచ్చితంగా నెరవేరుతుంది. ఈ కల నాకు చాలా ముఖ్యమైనది" అంటూ అని ఆమె ఉద్వేగంగా వివరించింది.
అనయ బంగర్ సంజయ్ బంగర్ కుమార్తె. ఆమె జన్మ పేరు ఆర్యన్ బంగర్. 2024లో ఆమె కేవలం 23 సంవత్సరాల వయస్సులో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని ప్రారంభించింది. ఆ తర్వాత వెంటనే ఆమె పేరును 'ఆర్యన్' నుండి 'అనయ'గా మార్చుకుంది. ఆమె క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగింది. ఓ క్లబ్ క్రికెట్ కూడా ఆడింది. అనయ భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కూడా ఆకాంక్షిస్తోంది. ఈ విషయంలో ఆమె ఇప్పటికే BCCI, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook