)
Team india New Jersey Sponsor: భారత క్రికెట్ జట్టుకు కొత్త టైటిల్ స్పాన్సర్ దొరికింది. అపోలో టైర్స్ కంపెనీ ఈ హక్కులను సొంతం చేసుకుంది. బీసీసీఐతో అపోలో టైర్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు అపోలో టైర్స్ 4.5 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు.. బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు.
ఇక ఈ ఒప్పందం 2027 వరకు కొనసాగుతుంది. గతంలో డ్రీమ్ 11 స్పాన్సర్‌గా ఉండగా, ఒక్కో మ్యాచ్‌కు 4 కోట్ల రూపాయలు చెల్లించింది. అపోలో టైర్స్‌తో పాటు కాన్వా, జేకే టైర్స్ కూడా బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. బిర్లా ఆప్టస్ పెయింట్స్ ఆసక్తి చూపించినా బిడ్డింగ్‌లో పాల్గొనలేదు.
డ్రీమ్ 11 తప్పుకున్న తర్వాత బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. బిడ్డింగ్ ప్రక్రియ మంగళవారం జరిగింది. గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో, పొగాకు బ్రాండ్లను బిడ్డింగ్‌లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధించింది. రాబోయే మ్యాచ్‌లలో భారత జట్టు జెర్సీపై అపోలో టైర్స్ పేరు కనిపించనుంది.
ప్రస్తుతం ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత జట్టు జెర్సీపై స్పాన్సర్ లోగో లేకుండా ఆడుతోంది. కొత్త స్పాన్సర్‌తో రాబోయే మ్యాచ్‌లలో, ముఖ్యంగా మహిళల వన్డే ప్రపంచకప్‌లో జెర్సీపై అపోలో టైర్స్ పేరు కనిపిస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంకలో జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook