)
AsiaCup2025: దుబాయ్ వేదికగా భారత్ పాక్ మ్యాచ్ పోరులో వాతావరణం ఎర్రబడింది. తొలి ఓవర్ నుంచే మెరుపులు మెరిసాయి. పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ ఆయూబ్ పై లక్షలాది మంది చూపులు. కానీ భారత పేస్ అటాక్ ముందే పాకిస్తాన్ కలలు కల్లలుగా మిగిలిపోయాయి.
హార్దిక్ పాండ్యా బాల్ పట్టుకోగానే స్టేడియంలో మామూలు హడావుడి లేదు. తొలి ఓవర్ ఫస్ట్ బాల్..ఆఫ్ స్టంప్ దిశగా వెనకడుగు వేయించిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ. సైమ్ ఆయుబ్ వేచి ఉన్నాడనుకున్నాడు. ఆ బాల్ ను ఆఫ్ సైడ్ పాయింట్ దిశగా గట్టిగా కొట్టడంతో స్టేడియం మొత్తం సైలెంట్ గా మారింది. తేరుకున్న ఫ్యాన్స్ ఒక్కసారి కేకలు, అరుపులు. జస్ప్రిత్ బుమ్రా మెరుపు రిఫ్లెక్స్ తో బాల్ ను క్యాచ్ పట్టేశాడు. ఆయూబ్ బిక్కముఖం వేశాడు. భారత జెండాలు రెపరెపలాడాయి. ఆ క్షణం దుబాయ్ గాలిలో భారత గర్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇంకెం పని అక్కడ పెవిలియన్ కు పయనమయ్యాడు ఆయూబ్. ఒమాన్ తో మొదటి మ్యాచులోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. భారత్ ముందు కూడా సేమ్ టు సేమ్. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఇచ్చిన బిల్డప్ చూస్తే ఇలాంటి ఏతులే పనికిరావు అనాల్సిందే. బుమ్రా బౌలింగ్ లో ఆయూబ్ 6 సిక్సులు కొడతాడ..ఇప్పుడు నెటిజన్లు వేసే పంచ్ డైలాగ్ లు సిక్సులు కొట్టడం కాదు..వికెట్ కాపాడుకోవడం కూడా చాతకాలేదు అంటూ ట్విట్టర్ లో మీమ్స్, ట్రోల్స్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఆయూబ్ పోయినా..పాకిస్తాన్ గాయాబ్ అయ్యింది. బుమ్రా తన మెరుపు మంత్రంతో మరో వికెట్ తీశాడు. మహ్మద్ హరిస్ ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. స్కోర్ బోర్డ్ 6 పరుగులకే 2 వికెట్లు చూపించినప్పుడు పాకిస్తాన్ ఫ్యాన్స్ ముఖాలు మాడిపోయాయి. ఫఖర్, సాహిబ్దాద్ ఫర్హాన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దినా..భారత బౌలర్ల స్పెల్‌లో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ప్రతి బాల్ ను జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6 ఓవర్లకు పాకిస్తాన్ 42 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఊరకుంటారా..ప్రతాపం చూపించారు. టపాటపా వికెట్లు పడుతూనే వచ్చాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ కు భారత బౌలర్లు చుక్కలతో పాటు చంద్రుడిని కూడా చూపించారు. టీమిండియా దెబ్బకు పాకిస్తాన్ అబ్బా అనాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ షాహిబాజా ఫర్హాన్ తప్పా మిగతా వాళ్లంతా ఫంక్షన్ కు వచ్చినట్లు వచ్చి పెవిలియన్ చేరుకున్నారు.
కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 2, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ ఛక్రవర్తి ఒక్కొక్క వికెట్ సాధించారు. ఫలితంగా, పాక్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమే సాధించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ షాహిబాజా ఫర్హాన్ (40) మాత్రమే తగిన స్కోరు సాధించగా, షాహిన్ అఫ్రిది (33) ఫఖర్ జమాన్ (17) మినహా మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు వెళ్లారు. చివరి ఓవర్లలో షాహిన్ వరుస బౌండరీలతో పాక్ స్కోరును పరిమితం చేసినప్పటికీ, 127 పరుగులకే ముగింపు వచ్చింది.
మైదానంలో జరిగిన ఈ బౌలింగ్ మాంత్రికం భారత క్రికెట్ అభిమానుల గర్వానికి కారణమైంది. తొలి బాల్నే గోల్డెన్ డక్‌తో ముగించగల బౌలింగ్, స్టేడియంలో ఉత్సాహాన్ని కుదిపేసింది. దుబాయ్ లో ఈ రాత్రి ఆ క్షణం భారత క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. మొత్తానికి భారత బౌలర్లు తమ దూకుడుతో పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.