
Asia cup 2025 IND vs UAE Live: ఆసియా కప్ 2025 టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. హాంకాంగ్ పై అఫ్గానిస్తాన్ ఘన విజయంతో తొలి మ్యాచ్ ముగిసింది. ఇప్పుడు నేడు (సెప్టెంబరు 11) జరగనున్న మ్యాచ్‌లో భారత్, యూఏఈ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయి వేదికగా జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈసారి టీమ్ఇండియా బరిలో దిగనుంది. టీమ్ఇండియా కూడా ఈ టోర్నీని విజయంతో ఆరంభించాలని చూస్తోంది. అయితే ఈ టోర్నీని ప్రత్యక్షప్రసారంగా ఎక్కడ చూడాలి? ఏ ఛానల్లో ఉచితంగా చూడొచ్చనే విషయాన్ని తెలుసుకోండి.
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ఇండియా ఆసియా కప్ టైటిల్ గెలుచేందుకు సన్నాహాలు చేస్తోంది. నేడు యూఏఈతో టీమ్ఇండియా పోరాడనుంది. ఇప్పటికే టీమ్ఇండియా 8 సార్లు గెలుపొందింది. అత్యంత విజయవంతమైన జట్టుగా టీమ్ఇండియా.. ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
మ్యాచ్ ప్రత్యక్షప్రసారం..
ఆసియా కప్ టోర్నీని ఇండియాలో సోనీ గ్రూప్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి. సోనీ స్పోర్ట్స్ టెన్1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1 HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 5, సోనీ స్పోర్ట్స్ టెన్ 5 HD టీవీ ఛానల్స్‌లో ప్రత్యక్ష్యప్రసారం కానున్నాయి. అదే విధంగా ప్రాంతీయ భాషల్లో మ్యాచ్ లు చూడాలనుకునే వారు.. సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ 3 HD (హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం, తెలుగు) చూడొచ్చు.
ఈరోజు యూఏఈతో జరగనున్న మ్యాచ్‌లో టీమ్ఇండియాతో పాటు ప్రత్యర్థి జట్ల అంచనా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టీమ్ఇండియా: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, జాస్ చక్రవర్తి.
రిజర్వ్ ప్లేయర్స్: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
యూఏఈ: ముహమ్మద్ వసీం (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఏతాన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిఖీ, మతివుల్లా ఖాన్, మహ్మద్ ఫరూక్, మొహమ్మద్ జవదుల్లా, మొహమ్మద్ జవదుల్లా ఖాన్, సిమ్రంజీత్ సింగ్, సగీర్ ఖాన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook