)
Asia Cup 2025 Team India Squad: ఆసియా కప్ 2025 టోర్నీకి బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమ్‌ను ప్రకటించింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీకి ఎంతో ఉత్కంఠ తరువాత టీమ్‌ను ఎంపిక చేశారు. ముంబైలో వాతావరణం సరిగా లేకపోవడంతో టీమ్ ఎంపిక ఆలస్యమైంది. టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు కల్పిస్తూ.. వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐపీఎల్లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌కు సెలక్టర్లు షాకిచ్చారు. కచ్చితంగా టీమ్‌లో ఉంటాడని భావించిన యశస్వి జైస్వాల్‌ను కూడా పక్కనపెట్టారు. జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయరగా ఎంపిక చేశారు. జితేష్ శర్మ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టిన సిరాజ్ పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు. జైస్వాల్‌తోపాటు ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు.
ఈ టోర్నీ మొదట భారత్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా UAEకి మార్చారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ సెప్టెంబర్ 10న దుబాయ్‌లో యూఏఈతో పోరుతో ఆసియా కప్ వేట ప్రారంభిస్తుంది. మూడు రోజుల తర్వాత అదే వేదికపై పాకిస్థాన్‌తో తలపడుతుంది.
? #TeamIndia's squad for the #AsiaCup 2025 ?
Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
— BCCI (@BCCI) August 19, 2025
ఆసియా కప్‌కు టీమిండియా జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి. అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.