)
Asia cup 2025 India vs Pakistan match Shoaib Akhtar praises india: దేశ మంతట కూడా భారత్, పాక్ ల మధ్య మ్యాచ్ కోసం నరాలు తెగె ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఆపరేషన్ సిందూర్ తర్వాత చిరకాల ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కు మరింత హైవోల్టెజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలొ ఇప్పటికే భారత్ లో దీనిపై పెద్ద రాజకీయా దుమారం చెలరేగుతుంది. పహల్గంలో మనదేశపౌరుల్ని మతం అడిగి మరీ చంపిన దాయాదికి పాక్ కు చెందిన వారితో మ్యాచ్ అవసరమా అంటూ కూడా అపోసిషన్ పార్టీలు మండిపడుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ బాధితులు సైతం ఈ మ్యాచ్ పై తమ వ్యతిరేకతను చాటు తున్నారు. మరోవైపు దీనిపై భారత్ ఆడకుంటే.. పాయింట్స్ పాక్ కు వెళ్లిపొతాయని క్రీడల మంత్రి క్లారీటీ సైతం ఇచ్చారు. మరోవైపు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసియాకప్ పై తన స్టైల్ లొ కామెంట్లు చేస్తున్నాడు. ఇప్పటికే ఈమ్యాచ్ కోసం టికెట్లు అమ్ముడు పోలేదంటూ కూడా వస్తున్న ప్రచారంను కొట్టిపారేశారు.
తాజాగా.. మరోసారి ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం పక్కా అంటూ జోస్యం చెప్పారు. ఈ మ్యాచ్‌లో ఒక షోలో జరిగిన చర్చలో అక్తర్ పాల్గొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుపై ఒకవైపు ప్రశంసలు కురిపిస్తూనే పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. భారత జట్టును పాకిస్తాన్‌ను అధిగమిస్తుందనే విషయం చాలా స్పష్టంగా కన్పిస్తుందన్నాడు. పాక్ ను ఘోరంగా ఓడించాలని చూస్తారు.. ఇది చాలా సులభమేనని వ్యాఖ్యానించాడు.
టీమిండియా ఫైనల్లో పాక్‌తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడాలని చూస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లిలేకపొవడం ఒక రకంగా పాక్ కు కలిసి వస్తుందని మిస్బా మరో వ్యాఖ్యత మాట్లాడగా.. దీన్ని అక్తర్ ఖండించాడు. భారత్ కనుక మొదట్లో వికెట్లు కొల్పోతే.. పాక్ కు విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే అని అక్తర్ అన్నాడు. అంతే కాకుండా.. భారత మిడిలార్డర్ ఎంతో బలంగా ఉందో చెప్పాడు.
ఈనేపథ్యంలో.. రింకు సింగ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, జితేష్ శర్మ , శుభ్‌మాన్ గిల్, తిలక్ వర్మ, జట్టులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ అన్నిరకాలుగా స్ట్రాంగ్ గా ఉందని కేవలం రెండు వికెట్లు పోతే.. జట్టు ఢీలా అవుతుందనుకోవడం కరెక్ట్ కాదని కూడా అక్తర్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. మరోవైపు.. భారత్, పాక్ మ్యాచ్ నేపథ్యంలో అభిమానుల్లో హైవోల్టేజ్ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.