)
Sanju Samson playing XI: ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలు, ఆటతీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శభాష్ సూరీడు… మాట నిలబెట్టుకున్నావ్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొడియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏడాది టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన చేసినా, శుభ్‌మన్ గిల్ తిరిగి వైస్ కెప్టెన్‌గా జట్టులో చేరడంతో సంజూ స్థానంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గిల్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ, పది ఇన్నింగ్స్‌లలో మూడు శతకాలతో తన సత్తా చాటాడు. కానీ గిల్ రాకతో సంజూ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందా లేదా అన్న ప్రశ్న అభిమానులను కలవరపెట్టింది.
మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉండగా, ఫినిషర్‌గా జితేష్ శర్మకు మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావించారు. ముఖ్యంగా ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయంలో జితేష్ కీలక పాత్ర పోషించడం అతనికి అదనపు బలం ఇచ్చింది. దీంతో సంజూ మరోసారి బెంచ్‌కే పరిమితమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే మీడియా అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. సంజూ శాంసన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతనికి తగిన ప్రాధాన్యం ఇస్తామని తెలిపాడు. అలాగే తుది జట్టు ఎంపికలో న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని హింట్ ఇచ్చాడు. చెప్పినట్టుగానే, యూఏఈతో తొలి మ్యాచ్‌లో సంజూని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడం ద్వారా సూర్య తన మాట నిలబెట్టుకున్నాడు.దీంతో నెటిజన్లు సూర్యను సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కెప్టెన్ కూల్, సంజూపై నమ్మకం చూపిన నిజమైన నాయకుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరోవైపు కొందరు అభిమానులు, శుభ్‌మన్ గిల్ కోసం సంజూకు అన్యాయం చేయకూడదని సూచిస్తున్నారు. సంజూను ఓపెనర్‌గా కొనసాగిస్తేనే అతని ఆటతీరు మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేష్ శర్మలకు మాత్రం ఈసారి బెంచ్‌కే పరిమితమయ్యారు.మొత్తం మీద, సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను సంతోషపరిచింది. సంజూ శాంసన్‌ను నమ్మి అవకాశమివ్వడం ద్వారా కెప్టెన్ తన లీడర్షిప్ స్కిల్స్‌ను మరోసారి నిరూపించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.