)
Tilak Varma In Hyderabad: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై యుద్ధం చేసి.. భారత జట్టుకు ట్రోఫీ అందించిన తెలంగాణ పోరడు.. క్రికెటర్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ ఫైన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. ఆట సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తాను బ్యాట్‌తో సమాధానం చెప్పినట్లు తిలక్ వర్మ వివరించారు.
ఆసియా కప్ ముగిసిన అనంతరం సోమవారం సాయంత్రం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన తిలక్ వర్మ మంగళవారం తన కోచింగ్ సెంటర్‌ను సందర్శించాడు. హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న లేగాల స్పోర్ట్స్ అకాడమీకి చేరుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా తన కోచ్ సలీమ్‌తో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే అక్కడ శిక్షణ పొందుతున్న భావి క్రికెటర్లతో తిలక్ వర్మ మాట్లాడాడు. అనంతరం మీడియా సమావేశంలో క్రికెటర్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
'దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడా. భారత్‌ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని పాకిస్థాన్‌పై ఆడా. మ్యాచ్‌ను గెలిపించి తీరాలనే పట్టుదలతో ఆడా' అని తిలక్ వర్మ తెలిపాడు. విరాట్ కోహ్లీ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారని.. కోహ్లీతో తనను పోల్చడం గర్వంగా అనిపిస్తోందని ప్రకటించాడు. భారత జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారని.. ఆసియాకప్ ఫైనల్లో గెలవడం ఆనందంగా ఉందని చెప్పాడు. తన కళ్ల ముందు దేశమే కనిపించిందని తెలిపాడు.
'ప్రతి మ్యాచ్‌లో వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశాం. అందరం సమష్టిగా కష్టపడ్డాం. చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్ చేశా. దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతోనే ఆడాను' అని హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ వివరించారు. పాకిస్థాన్ క్రికెటర్లు మ్యాచ్ సందర్భంగా స్లెడ్జింగ్‌కు పాల్పడ్డా కూడా.. ఉద్రేకానికి.. కోపానికి గురికాకుండా వారికి బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చినట్లు తిలక్ వర్మ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook