Add Zee Business As A Preferred Source
App

Hockey Asia Cup: మనోళ్లు అదుర్స్.. చైనాను చిత్తుగా ఓడించి.. ఫైనల్ కు చేరిన భారత్..!!

Hockey Asia Cup: భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్ ఒకే ఒక అడుగు దూరంలో ఉంది. చివరి సూపర్ 4 మ్యాచ్ లోనూ చైనాను చిత్తు చేసింది. దీంతో భారత జట్టు ఫైనల్ దూసుకెళ్లింది. శనివారం బీహార్ లో జరిగిన మ్యాచులో చైనాపై 0-7 తేడాతో ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఆరంభం నుంచే భారతర్ మ్యాచును పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని మూడవ నిమిషంలో లక్రా శిలానంద్ చేసిన గోల్ తో భారత్ జోరు షురూ అయ్యింది. ఆసియా కప్ లో టైటిల్ పోరుకు అర్హత సాధించడం భారత్ కు 9వ సారి అని చెప్పవచ్చు. ఈ టోర్నీలో భారత్ తిరుగులేని రికార్డును క్రియేట్ చేస్తుంది. ఆదివారం ఫైనల్లో సౌత్ కొరియాతో తలపడనుంది భారత్.

Hockey Asia Cup: మనోళ్లు అదుర్స్.. చైనాను చిత్తుగా ఓడించి.. ఫైనల్ కు చేరిన భారత్..!!
Image Credit: Hockey Asia Cup

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More