Glenn Maxwell ODI Retirement: ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆటగాళ్లకు రిటైర్మెంట్ దశ ఉన్నట్లుంది. రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ కూడా టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20లకు అందుబాటులో ఉంటానని గ్లెన్ మ్యాక్స్ వెల్ తెలిపారు. 36 ఏళ్ల గ్లెన్ మ్యాక్స్ వెల్ 2012లో ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2015, 2013 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అతను ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి మ్యాక్సీ టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడుతున్నాడు.
2023 ప్రపంచ కప్ లో ఆఫ్టనిస్తాన్ తో జరిగిన మ్యాచులో వన్డే చరిత్రలోనే గ్లెన్ మ్యాక్స్ వెల్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైలోని వాఖండే స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఆఫ్ఘన్ జట్టు 292 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జట్టులోని ఏడుగురు బ్యాటర్లు 91 పరుగులకే ఔట్ అయ్యారు. ఇక్కడి నుంచి ఆసీస్ ఓటమి ఖామమనిపించింది. కానీ మ్యాక్స్ వెల్ తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్ ను గట్టెక్కించాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 128 బంతుల్లో 201 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. అతను ఆ మ్యాచులో నడవలేకపోయినా జట్టును మాత్రం విజయపథంలో నడిపించాడు.
మ్యాక్స్ వెల్ మార్చిలోనే వన్డేల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో మ్యాక్స్ వెల్ఆస్ట్రేలియాచీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీకి 2027 ప్రపంచకప్ ఆడగలనని తాను అనుకోవడం లేదని చెప్పాడు. తన స్థానంలో రాబోతున్న ఆటగాళ్లు 2027 ప్రపంపకప్ కోసం ప్లాన్ వేసే సమయం వచ్చిందని తాను భావిస్తున్నట్లు అప్పుడే చెప్పాడని సమాచారం.
మ్యాక్స్ వెల్ తన 13ఏళ్లవన్డే కెరీర్ లో 149 మ్యాచులు ఆడాడు. 22.81 సగటు, 126.70స్ట్రైక్ రేట్ తో 3390 పరుగులు చేశాడు. ఈ సయమంలో 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లోనూ 77 వికెట్లు తీసుకున్నాడు. మ్యాక్స్ వెల్ బెస్ట్ 40 పరుగులకు 4 వికెట్లు. భారత్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వన్డే కెరీర్ లో చివరి మ్యాచ్. మార్చి 4న దుబాయ్ లో జరిగిన మ్యాచులో మాక్స్ వెల్ 7 పరుగులు చేసిన తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.
Also Read: Girl Gang-Raped: వీళ్లను ఏం చేస్తే మారుతారు? 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..వీడియోతో బ్లాక్‌మెయిల్ !!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









