Glenn Maxwell Records: వన్డేలకు మ్యాక్సీ గుడ్‌బై, మాక్స్‌వెల్ కెరీర్‌లో రికార్డులు ఇవే

Glenn Maxwell Records: ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 36 ఏళ్ల ఆసిస్ క్రికెటర్ వన్డే క్రికెట్‌కు టాటా చెప్పడం క్రికెట్ అభిమానులకు షాక్. మాక్స్‌వెల్ కెరీర్‌లో కీలకమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2025, 03:19 PM IST
Glenn Maxwell Records: వన్డేలకు మ్యాక్సీ గుడ్‌బై, మాక్స్‌వెల్ కెరీర్‌లో రికార్డులు ఇవే

Glenn Maxwell Records: ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2012లో ఆస్ట్రేలియా జట్టులో అడుగెట్టిన 36 ఏళ్లు గ్లెన్ మాక్స్‌వెల్ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. 13 ఏళ్ల వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాక్స్‌వెల్ టెస్టుల్లో కొనసాగవచ్చు. 

Add Zee News as a Preferred Source

గ్లెన్ మాక్స్‌వెల్ అంటే ఒక్కసారిగా క్రికెట్ అభిమానులకు 2023లో ఇండియాలో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ గుర్తొస్తుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. గాయపడిన కాలితో కుంటుతూనే 201 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు. అందుకే వన్డే చరిత్రలో బెస్ట్ ఇన్నింగ్స్‌గా చెబుతారు. వన్డేల్లో ఆసీస్ ఆటగాడి తొలి డబుల్ సెంచరీ కూడా ఇదే. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. 128 బంతుల్లో 201 పరుగుల చేసి జట్టుని గెలిపించాడు. 

మాక్స్‌వెల్ రికార్డులు

ఇప్పటి వరకూ గ్లెన్ మాక్స్‌వెల్ 149 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలకు స్వస్తి చెప్పినా టీ20లో కొనసాగనున్నాడు. మాక్స్‌వెల్ మంచి ఆల్‌రౌండర్. ఆఫ్‌స్పిన్నర్‌గా 77 వికెట్లు పడగొట్టాడు. 3990 పరుగులు సాధించాడు. వన్డేల్లో 33.81 యావరేజ్, 126.70 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. వన్డేల్లో మూడు సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. 4 వికెట్ హాల్ నాలుగు సార్లు సాధించిన ఘనత ఉంది. 

ఇప్పటికే మాక్స్‌వెల్ సహచరులైన స్టీవ్ స్మిత్ 2025 మార్చ్‌లో , మార్కస్ స్టోయినిస్ ఫిబ్రవరిలో రిటైర్మంట్ ప్రకటించగా మాధ్యూ వేడ్ 2024 అక్టోబర్‌లో, డేవిడ్ వార్నర్ 2024 జనవరిలో రిటైర్ అయ్యారు. ఇకపై కేవలం టీ20 ఫార్మట్ క్రికెట్‌పైనే దృష్టి కొనసాగించాలని మాక్స్ వెల్ భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా నుంచి చాలా మంది సీనియర్లు రిటైర్ కావడంతో ఆస్ట్రేలియా 2026 ప్రపంచకప్ కోసం కొత్త జట్టు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. 

Also read: Fighter Jets: ఇండియా పాక్ యుద్ధంలో ఇండియా కోల్పోయిన ఫైటర్ జెట్స్ ఎన్ని, ఎవరు ఏమంటున్నారు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News