IPL 2026 Auction: ఐపీఎల్‌లో 3 ఆటగాళ్లను బ్యాన్ చేసిన బీసీసీఐ..క్రికెటర్ల ప్రవర్తనపై సీరియస్..ఐపీఎల్ ఛాయల్లోకి కూడా రారు!

IPL 2026 Banned Players: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ సంచలన ప్రకటన చేసింది. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లపై నిషేధం విధించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నిలిచింది.

Written by - Harish Darla | Last Updated : Dec 10, 2025, 03:45 PM IST
IPL 2026 Auction: ఐపీఎల్‌లో 3 ఆటగాళ్లను బ్యాన్ చేసిన బీసీసీఐ..క్రికెటర్ల ప్రవర్తనపై సీరియస్..ఐపీఎల్ ఛాయల్లోకి కూడా రారు!

IPL 2026 Banned Players: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ సంచలన ప్రకటన చేసింది. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లపై నిషేధం విధించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నిలిచింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న వేలం కోసం రిజిస్ట్రేషన్ సమయంలో బీసీసీఐ ఈ చర్య తీసుకుంది. విదేశీ ఆటగాళ్లు ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జాసన్ రాయ్‌లపై బ్యాన్ విధించారు. 

Add Zee News as a Preferred Source

కారణం ఏమిటంటే?
ఇంగ్లాండ్ జట్టుకు చెందిన హ్యారీ బ్రూక్, జాసన్ రాయ్ ఇద్దరూ 2025 IPL వేలంలో అమ్ముడయ్యారు. కానీ వారు వ్యక్తిగత కారణాల వల్ల లీగ్‌లో ఆడకుండా పక్కకి తప్పుకున్నారు. BCCI నిబంధనల ప్రకారం.. కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా ఆటగాడు లీగ్ నుండి వైదొలిగితే, అతనిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. ఈ నియమం ప్రకారం.. వారిద్దరినీ 2026, 2027 ఐపీఎల్ సీజన్లలో నిషేధించారు. 

Also Read: Risky Childbirth: రూపాయి బ్లేడ్‌తో ప్రసవం చేసిన మహిళ..బాణాలు, వెదురు కర్రలతో బిడ్డకు కాన్పు..దారుణమైన సంఘటన వెలుగులోకి!

హ్యారీ బ్రూక్‌ను 2025 సీజన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇంగ్లాండ్‌లో జరిగే దేశీయ క్రికెట్ సీజన్‌లో ఆడేందుకు అతను ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. దీని వల్ల నేరుగా బీసీసీఐ రెండేళ్ల నిషేధాన్ని విధించింది. అదేవిధంగా.. జాసన్ రాయ్ 2024లో వ్యక్తిగత కారణాల వల్ల లీగ్ నుండి వైదొలిగాడు. అతను 2025 వేలానికి కూడా నమోదు చేసుకోలేదు.

మరో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పరిస్థితి కూడా ఇంతే ఉంది. వేలంలో జట్టు కొనుగోలు చేసిన తర్వాత కూడా బెన్ స్టోక్స్ లీగ్ నుంచి వైదొలిగాడు. దీంతో ఇతడిపై కూడా బీసీసీఐ నిషేధాన్ని విధించింది. దీని అర్థం స్టోక్స్, బ్రూక్, రాయ్ రాబోయే రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో కనిపించరు.

ఈ నిర్ణయం రాబోయే 2026 ఐపీఎల్ సీజన్ మినీ వేలం మార్కెట్‌లో పెద్ద మార్పును తీసుకువచ్చింది. అనేక ఫ్రాంచైజీలు ఈ స్టార్ ఆటగాళ్లపై దృష్టి సారించినప్పటికీ, జట్లు ఇప్పుడు ప్రత్యామ్నాయాలను కనుగొనవలసి ఉంది. ఈ క్రమంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇలాంటి మార్పులు, కొత్త నిబంధనల కారణంగా రాబోయే మినీ వేలం ఎలా జరుగుతుందని క్రికెట్ అభిమానులు, ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

Also Read: Holidays List 2026: స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు..24 రోజులు హాలీడే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News