ఐపీఎల్ 2020పై స్పందించిన సౌరవ్ గంగూలీ

కరోనా ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మీద పడింది. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా నీలినీడలు కమ్ముకునే ఉన్నాయి.

Last Updated : Mar 25, 2020, 01:58 PM IST
ఐపీఎల్ 2020పై స్పందించిన సౌరవ్ గంగూలీ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో దీని ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మీద పడింది. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా నీలినీడలు కమ్ముకునే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా కారణంగా రెండు వారాలపాటు వాయిదా వేశారు. కానీ తాజా పరిస్థితులను చూస్తే ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందో, అసలు టోర్నీ నిర్వహిస్తారా లేదో స్పష్టత లేదు. RRR ఫ్యాన్స్‌కు ఉగాది కానుక.. రౌద్రం.. రుధిరం.. రణం

ఇటీవల ఫ్రాంఛైజీలతో మీటింగ్ ఏర్పాటు చేయగా సోషల్ డిస్టాన్సింగ్ కారణంగా కొన్ని కొన్ని జట్ల మేనేజ్ మెంట్లు బీసీసీఐ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో మీటింగ్ రద్దయింది. తాజా పరిణామాలపై మీడియా బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని సంప్రదించింది.  గంగూలీ పీటీఐతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహణపై ఏ విషయాన్ని చెప్పలేను. గత 10 రోజుల్లో పరిస్థితి ఏం మారలేదు. ఐపీఎల్ వాయిదా వేసినప్పుడు ఉన్న పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020 ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేమని’ పేర్కొన్నారు. రైళ్లు రద్దు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్

శుభవార్త.. ఐటీ రిటర్న్స్ తుది గడువు పొడిగించిన కేంద్రం

కింగ్స్ ఎలెన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా పీటీఐతో మాట్లాడారు. ఐపీఎల్ ను బీసీసీఐ మరింత కాలం వాయిదా వేసే అవకాశం ఉందన్నారు. మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జనాలు లేకుండా ఐపీఎల్ నిర్వహించాల్సి వస్తుందని, ఇంకా చెప్పాలంటే మనుషుల ప్రాణాలకంటే ఐపీఎల్ ముఖ్యం కాదని నెస్ వాడియా అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏ క్రికెటర్ వచ్చి మ్యాచ్‌లు ఆడతాడని సందేహాలు లేవనెత్తారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: ‘సాహో’ బ్యూటీ అందాల సునామీ

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News