BCCI Central Contract Players List: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. 2024-25 సీజన్ కోసం వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించగా.. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు మళ్లీ చోటు కల్పించింది. 2023-24 సీజన్‌కు వీరిద్దరిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా తదితర ప్లేయర్లు తొలిసారి బీసీసీఐ కాంట్రాక్ట్ పరిధిలోకి వచ్చారు. సెంట్రల్ కాంట్రాక్టులను 4 కేటగిరీలుగా విభజించారు. ఆటగాళ్ల ప్రదర్శన, మూడు ఫార్మాట్లలో ఆడే విధానాన్ని బట్టి A+, A, B, C కేటగిరీలుగా డివైడ్ చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికినా.. వారికి గౌరవం కల్పిస్తూ A+ కేటగిరీలో చేర్చింది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా A+ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. వీరికి రూ.7 కోట్ల వార్షిక జీతం బీసీసీఐ అందిస్తుంది.
క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారనే కారణంగా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ BCCI కాంట్రాక్టు నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గతేడాది బీసీసీఐ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించినా.. శ్రేయాస్ అయ్యర్ తన అద్భుతమైన ఫామ్‌తో బీసీసీఐకి గట్టి హెచ్చరికలే పంపించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్ములేపి.. భారత్‌ను విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరుఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కల్పిస్తూ.. బి గ్రేడ్ కేటగిరీలో చేర్చింది. ఇషాన్ కిషన్ కూడా దేశవాళీ టోర్నీల్లో రాణించడంతోపాటు ఐపీఎల్‌లో సెంచరీతో మెరిశాడు. ఈ యంగ్ వికెట్ కీపర్‌ను సి గ్రేడ్ కేటగిరీలో చేర్చింది. శార్దుల్ ఠాకూర్, రవీచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, జీతేశ్ శర్మ, కేఎస్ భరత్ వంటి ప్లేయర్లు ఈసారి బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది.
BCCI సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే:
గ్రేడ్ A+
==> రోహిత్ శర్మ
==> విరాట్ కోహ్లీ
==> జస్‌ప్రీత్ బుమ్రా
==> రవీంద్ర జడేజా
గ్రేడ్ A
==> మహ్మద్ సిరాజ్
==> కేఎల్ రాహుల్
==> శుభ్‌మన్ గిల్
==> హార్దిక్ పాండ్యా
==> మహ్మద్ షమీ
==> రిషబ్ పంత్
గ్రేడ్ B
==> సూర్యకుమార్ యాదవ్
==> కుల్దీప్ యాదవ్
==> అక్షర్ పటేల్
==> యశస్వి జైస్వాల్
==> శ్రేయాస్ అయ్యర్
గ్రేడ్ C
==> రింకు సింగ్
==> తిలక్ వర్మ
==> రుతురాజ్ గైక్వాడ్
==> శివం దుబే
==> రవి బిష్ణోయ్
==> వాషింగ్టన్ సుందర్
==> ముఖేష్ కుమార్
==> సంజు శాంసన్
==> అర్ష్‌దీప్ సింగ్
==> ప్రసిద్ధ్ కృష్ణ
==> రజత్ పాటిదార్
==> ధ్రువ్ జురెల్
==> సర్ఫరాజ్ ఖాన్
==> నితీష్ కుమార్ రెడ్డి
==> ఇషాన్ కిషన్
==> అభిషేక్ శర్మ
==> ఆకాష్ దీప్
==> వరుణ్ చక్రవర్తి
==> హర్షిత్ రాణా
గ్రేడ్‌ల వారీగా జీతాలు ఇలా..
==> గ్రేడ్ A+: ఏడాదికి రూ.7 కోట్లు
==> గ్రేడ్ A: ఏడాదికి రూ.5 కోట్లు
==> గ్రేడ్ B: ఏడాదికి రూ.3 కోట్లు
==> గ్రేడ్ C: ఏడాదికి రూ.కోటి
Also Read: Ration Cards: రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ బిగ్ అలర్ట్.. బోగస్ కార్డుల ఏరివేత..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









