BCCI New Rules: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 త్వరలోనే మొదలు కానుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలకు కొత్త నిబంధనలు అమలు చేయనుంది బీసీసీఐ. ఈ నిబంధనలు ఆటగాళ్లతో పాటు కుటుంబసభ్యులకు కూడా వర్తించనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవి కాస్త కఠినమైన ఆంక్షలే. ఆటగాళ్లు ఇకపై టీమ్ బస్సులోనే ప్రయాణ చేయడం, కుటుంబసభ్యులు డ్రెస్సింగ్ రూమ్స్‌లో ప్రవేశించకూడదనే నిబంధనలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లు ప్రాక్టీసు కోసం టీమ్ బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాల్లో రాకూడదు. ఐపీఎల్ మ్యాచ్ అనంతరం జరిగే ప్రజంటేషన్ వేడుకల్లో స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించకూడదు. ఫార్మల్ డ్రెస్సింగ్ ఉండాలి. ఇది పాటించకపోతే మొదటిసారి వార్నింగ్ ఇస్తారు. రెండోసారి జరిమానా విధిస్తారు. ఆటగాళ్లు తమ గుర్తింపు కార్డును విధిగా వెంట తెచ్చుకోవాలి. ఐపీఎల్ ప్రాక్టీసు రోజుల్లో కుటుంబసభ్యులు, స్నేహితులు డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రవేశించడానికి వీల్లేదు. మ్యాచ్ ప్రాక్టీసు జరిగేటప్పుడు మాత్రమే సిబ్బందిని డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతిస్తారు. ఆటగాళ్ల స్నేహితులు, కుటుంబసభ్యులు ఇతర వాహనాల్లో ప్రయాణం చేయాలి.
బౌండరీ లైన్ వెలుపల ఉన్న ఎల్ఈడీ బోర్డులపై బంతిని కొట్టకూడదని బీసీసీఐ హెచ్చరించింది. ఆటగాళ్లలో మరింత క్రమశిక్షణ పెంచేందుకే కఠినమైన నియమాలు అమలు చేస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది.
Also read: Passport changes: ఆ వివరాల్లేకుండా పాస్‌పోర్ట్, ఏయే డాక్యుమెంట్లు అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









