IPL 2025 Opening Ceremony : 2025 ఐపీఎల్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న కోల్ కతా బెంగళూరు మ్యాచుతో ఈ మెగా లీక్ షురూ కానుంది. దీంతో బిసిసిఐ ఇప్పటికే ఈ టోర్నీ ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. మ్యూజిక్ కాన్సర్ట్, డ్యాన్స్ ఈవెంట్స్ ఉండనున్నాయి. ఈ ఈవెంట్లో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ తారలు హాజరై సందడి చేయనున్నారు.
ఈసారి టోర్నీకి మొత్తం 13 స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వునున్నాయి. అయితే ప్రతీ ఏడాది టోర్నీలో తొలి మ్యాచుకు మాత్రమే ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. కానీ ఈసారి టోర్నీకి వేదిక కానున్నఅన్ని స్టేడియాల్లో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని బోర్డ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆయా స్టేడియాల్లో జరగనున్న తొలి మ్యాచులో ఈవెంట్ ఉంటుదని తెలిసింది. ఓపెనింగ్ మ్యాచ్ కే కాకుండా ప్రతీ స్టేడియంలో ప్రేక్షకులు ఈ అనుభూతి పొందేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మార్చి 22న కోల్ కతా వేదికగా కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కు ఓపెనింగ్ సెర్మనీ కూడా ఉంటుంది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయనున్నారు. ఈ సారి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేందుకు ప్రతీ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచులో ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామని ..ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న అన్ని స్టేడియాల్లో ఈ ఈవెంట్స్ ఉంటాయి. ఇందులో సాంస్క్రతిక, కల్చరల్ ఈవెంట్స్ ప్రదర్శన ఉంటుందని ఈవెంట్ ఆర్గనైజర్ ఒకరు తెలిపారు.
Also Read: Money: 60ఏళ్లు దాటిన వారిని ఈ ప్లాన్‌లో చేర్చండి.. 5 వేల పెన్షన్ వస్తుంది!
కాగా ఈ ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్, ధర్మశాల, గువాహటి, విశాఖపట్టణం నగరాల్లో జరగనున్నాయి. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ ఐపీఎల్ టోర్నీ జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









