)
BCCI Vs Pak: భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో అతిగా ప్రవర్తించిన ఆ ఇద్దరు పాక్ క్రికెటర్స్ పై భారత్ క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈవిషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ-మెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. పాక్ ప్లేయర్లు హారిస్ రవూఫ్, ఫర్హాన్ నుంచి లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారు ఇవ్వని పక్షంలో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది.
భారత్‌తో మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్‌షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చేష్టలకు పాల్పడటం విమర్శలకు దారితీసింది. తన సెలబ్రేషన్స్‌ను ఫర్హాన్ సమర్థించుకొనేందుకు ప్రయత్నించాడు.
అప్పటికప్పుడు అలా సంబరాలు చేసుకున్నా..బయట ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని వ్యాఖ్యానించాడు. హారిస్ రవూఫ్ ఏకంగా జెట్ ఫ్లైట్లు కూలినట్లు 6-0 అని సైగలు చూపించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జెట్ విమానాలను తమ సైన్యం కూల్చేసిందని పాక్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. దానిని గుర్తు చేసేలా హారిస్ చేష్టలు ఉన్నాయనేది ప్రధాన విమర్శ. ఇక భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో వాగ్వాదానికీ దిగాడు.
ఇప్పటికే రిఫరీ విషయంలో అవమానాలు ఎదుర్కొన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్‌పై అక్కసును మాత్రం వదలట్లేదు. టీమ్ఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. గ్రూప్ స్టేజ్‌లో పాక్‌పై భారత్ విజయం సాధించింది. ఆ గెలుపును పహల్గాం ఉగ్రదాడి బాధితులు, భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు సూర్య వెల్లడించాడు. ఇప్పుడు అదే పాక్ కడుపు మంటకు కారణమైంది. సూర్య వ్యాఖ్యలు రాజకీయపరంగా ఉన్నాయంటూ ఐసీసీ దృష్టికి పీసీబీ తీసుకెళ్లింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.