LSG vs GT Highlights: ఐపీఎల్‌లో సరికొత్త ఫలితాలు వస్తుండడంతో ప్రేక్షకులకు మస్త్ మజా వస్తోంది. ఏ జట్టు.. ఏ జట్టుపై గెలుస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు మించి ఫలితాలు అందుతున్నాయి. తాజాగా లక్నో సూపర్ జియంట్స్, గుజరాత్ టైటాన్స్ అదే జరిగింది. వరుస విజయాలతో జైత్రయాత్ర చేస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు లక్నో బ్రేక్ వేసింది. అదే దూకుడుతో రెండు విజయాలతో జోరులో ఉన్న రిషబ్ పంత్ సేన టైటాన్స్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జియాంట్స్ విజయం సాధించింది.
Also Read: MS Dhoni Retirement: ఈ ఐపీఎల్ చివరిది కానుందా.. కొన్ని రోజుల్లో ధోనీ రిటైర్‌మెంట్?
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈసారి టాపార్డర్ బ్యాటింగ్‌తో సత్తా చాటగా.. మిడిలార్డర్ స్కోర్ బోర్డును ముందుకు కదిలించలేకపోయింది. సాయి సుదర్శన్ 37 బంతుల్లో 56 పరుగులు చేయగా.. కెప్టెన్ శుభమన్ గిల్ నుంచి మంచి ప్రదర్శన లభించింది. 38 బంతుల్లో 60 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. అయితే తదుపరి వచ్చిన బ్యాటర్లు ఆ జోరును అందుకోలేకపోయారు. బట్లర్ 16, వాషింగ్టన్ సుందర్ 2 పరుగులు చేశారు. రూతర్‌ఫోర్డ్ 22 పరుగులతో పర్వాలేదనిపించగా.. షారూక్ ఖాన్ 11 స్కోర్ చేశాడు. విజయాలతో జోరు మీదున్న గుజరాత్ బ్యాటర్లకు లక్నో బౌలర్లు కళ్లెం వేసి స్కోర్‌ను నియంత్రించారు. పెద్ద స్కోర్ నమోదు కాకుండా చక్కగా బౌలింగ్ వేశారు. శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీయగా.. దిగ్వేశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: CSK vs KKR: కోల్‌కత్తా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై.. ధోనీ కెప్టెన్సీలో జట్టు ఓడిపోయిందా?
హ్యాట్రిక్‌పై కన్నేసిన లక్నో సూపర్ కింగ్స్ అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ (21) తక్కువ పరుగులకే వెనుదిరగగా.. ఐడెన్ మార్‌క్రమ్ (58), నికోలస్ పూరన్ (61) కలిసి ఇద్దరు అర్ధ శతకాలు నమోదు చేశారు. చక్కగా భాగస్వామ్యం చేసుకుంటూ తర్వాతి బ్యాటర్లకు ఛేదనను సులువు చేశారు. ఆయుశ్ బదౌనీ చివర వరకు నిల్చోని 28* పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు. డేవిడ్ మిల్లర్ 7 పరుగులకే ఔటవగా.. సమద్ 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటర్లు నిలిపిన లక్ష్యాన్ని గుజరాత్ బౌలర్లు కాపాడలేకపోయారు. ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లతో సత్తా చాటగా.. రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక్కో వికెట్ తీశారు.
వరుసగా నాలుగు విజయాలతో ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫేవరెట్ జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తోంది. అలాంటి జట్టుకు లక్నో సూపర్ జియాంట్స్ తొలి ఓటమిని రుచి చూపించింది. లక్నో, గుజరాత్ ఈ సీజన్‌లో సమష్టిగా రాణిస్తూ అద్భుత విజయాలు పొందుతున్నాయి. ఐదు మ్యాచ్‌లు ఆడి ఒకటి మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లను గెలిచి గుజరాత్ టాప్‌లో కొనసాగుతుండగా.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు ఓడి లక్నో నాలుగు విజయాలు సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌లను సొంతం చేసుకోవడంతో హ్యాట్రిక్ సంబరాలు చేసుకుంటోంది. దీనికితోడు హ్యాట్రిక్ విజయమే గుజరాత్‌ను ఓడించడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









