)
Vaibhav Suryavanshi Stunning Century: విజయాలతో ఫుల్‌జోష్‌లో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. వైభవ్ సూర్యవంశీ రూపంలో వచ్చిన చిచ్చర పిడుగు గుజరాత్ బౌలర్లను ఊచకోత కోయగా.. రాజస్థాన్ రాయల్స్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 14 ఏళ్ల వయసులో 35 బంతుల్లో సెంచరీ సరికొత్త రికార్డులు నెలకొల్పగా జట్టు కష్టాల ఉన్న సమయంలో భారీ విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్‌కు మరో ఓటమి తప్పలేదు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. శుభమన్ గిల్ మరోసారి చెలరేగి ఆడి కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 50 బంతుల్లో 84 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 4 సిక్స్‌లు, 5 ఫోర్లతో గిల్ సత్తా చాటగా.. సాయి సుదర్శన్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. జోస్ బట్లర్ 26 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తి చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 13 పరుగులకు పరిమితమవగా.. రాహుల్ తెవాటియా (9) నిరాశపర్చగా.. రాహుల్ 5* పరుగులు జోడించాడు. రాజస్థాన్ బౌలర్లు స్కోర్ బోర్డును కట్టడి చేయలేకపోగా వికెట్లు తీయడంలో కూడా తడబడ్డారు. మహీశ్ తీక్షణ 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ తలా ఒక్కో వికెట్ తీశారు.
రాజస్థాన్ రాయల్స్ విధించిన 210 లక్ష్యాన్ని వైభవ్ సూర్యవంశీ సంచలన సెంచరీతో సులువుగా సాధించేసింది. 15.5 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. 25 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మాట్లాడుకోవాల్సిందిల్లా వైభవ్ సూర్యవంశీ సెంచరీ గురించే. ఐపీఎల్లో తన ఎంట్రీతోనే సంచలనం రేపగా.. తాజాగా రెండో మ్యాచ్‌లోనే రికార్డు శతకాన్ని బాదాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఐపీఎల్లో రికార్డు నమోదు చేశాడు. 7 ఫోర్లతో చెలరేగగా.. 11 సిక్స్‌లతో తుఫాన్ సృష్టించాడు. ఇక మరో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ భారీ స్కోర్ నమోదు చేశాడు. 40 బంతుల్లో 70 పరుగులు చేయగా.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది నాటౌట్‌గా నిలిచాడు. నితీశ్ రానా 4 పరుగులు చేసి వెళ్లిపోగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు.
బ్యాటింగ్‌లో దుమ్మురేపిన గుజరాత్ బ్యాటర్లు కానీ బౌలర్లు తేలిపోయారు. 7 మంది టాప్ బౌలర్లు ఉన్నా కూడా స్కోర్ బోర్డును నియంత్రించలేకపోగా.. వికెట్లు తీయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారు. దాదాపు 12 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా పడకపోవడం గమనార్హం. గ్రౌండ్లో పాతుకుపోయిన వైభవ్ సూర్యవంశీని 101 పరుగులకు ఎట్టకేలకు ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా, యశస్వి జైస్వాల్‌ను మాత్రం ఔట్ చేయలేకపోయారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
అయినా కష్టమే!
విజయాలతో దూకుడు మీద ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్‌తో మూడో ఓటమిని ఖాతాలో వేసుకోగా.. 6 విజయాలు పొంది ఒక స్థానం వెనుకంజ వేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ భారీ విజయంతో పాయింట్లను మెరుగుపర్చుకోవడమే కాక నెట్ రన్‌రేట్‌ను భారీగా పెంచేసుకుంది. 10 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకోగా.. 7 ఓటములను చవిచూసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత విజయం పొందడం గమనార్హం. ఈ విజయంతో ఒక స్థానం పైకి ఎక్కినా కూడా రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe