Kavya Maran Rs 58 Crore Deal: ప్రపంచ క్రికెట్‌లో దేశాల సరిహద్దులు చెరిపేసి అందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చిన టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించే ఐపీఎల్‌లో పూటకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఏడాదికోసారి జరిగే ఐపీఎల్‌లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజాలు ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్‌కు ఓ భారీ డీల్ వచ్చిందని తెలుస్తోంది. అయితే ఆ డీల్‌ను నిర్ద్వందంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో ఓ ఫ్రాంచైజీ ఆ డీల్ ఇచ్చినట్లు.. అయితే ఆ డీల్‌ను తిరస్కరించడం సంచలనం రేపుతోంది. ఆ డీల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: KTR: రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి కిరాయిలు కూడా కట్టలేవా? కేటీఆర్ నిలదీత
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ దేశానికి అద్భుతంగా సేవలు అందిస్తూనే అక్కడి లీగ్ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. వాటితోపాటు మన దేశానికి చెందిన ఐపీఎల్‌లో చెరగని ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వారిద్దరూ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమిన్స్ కెప్టెన్‌గా ట్రావిస్ హెడ్ బ్యాట్స్‌మన్‌గా అదరగొడుతున్నారు. అయితే పూర్తిగా తమకే సమయం కేటాయించాలని.. ఇతర లీగ్ మ్యాచ్‌లు ఆడరాదని ఐపీఎల్‌కు చెందిన ఓ ఫ్రాంచైజ్ డీల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.
Also Read: Double Jackpot: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. జీఓ నం 59తో రెట్టింపు ఆదాయం
ప్రపంచకప్, టెస్టు చాంపియన్ విజేతలు హెడ్, కమిన్స్ అమెరికాకు చెందిన లీగ్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హెడ్ వాషింగ్టన్ ఫ్రీడమ్, కమిన్స్ సాన్‌ఫ్రాన్సిస్కో యూనికర్న్ తరఫున ఆడుతున్నాడు. దీంతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన బిగ్ బాష్ లీగ్‌కు వారిద్దరూ ఆడుతున్నారు. వీటితోపాటు ఐపీఎల్‌కు కూడా హెడ్, కమిన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎస్‌ఏ20, ఐఎల్‌టీ20 వంటి లీగ్‌లలో ఆడుతున్నారు. అటు ఆస్ట్రేలియా దేశానికి ఆడుతూ.. ఇటు ఇతర లీగ్ మ్యాచ్‌లు ఆడుతుండడంతో హెడ్, కమిన్స్‌పై ఒత్తిడి పెరుగుతోందని ఐపీఎల్‌లోని ఓ ఫ్రాంచైజీ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరినీ ఇతర లీగ్ మ్యాచ్‌ల నుంచి వైదొలగాలని కోరుతూ ఓ డీల్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read: Vijay: 'మీకు నేనున్నా'.. కరూర్ తొక్కిసలాట బాధితులతో హీరో విజయ్ వీడియో కాల్
హెడ్, కమిన్స్‌కు ఐపీఎల్‌లోని ఓ ఫ్రాంచైజీ రూ.58 కోట్ల భారీ డీల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇతర లీగ్‌ల నుంచి వైదొలిగి పూర్తిగా తమ సొంత దేశం ఆస్ట్రేలియాతోపాటు ఐపీఎల్‌కు సమయం కేటాయించాలని ప్రతిపాదించినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ డీల్‌ను ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇంత భారీ డీల్‌ను తిరస్కరించి వారు అన్నింట్లో ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఆ డీల్ ఇచ్చింది కావ్య మారన్ అని తెలుస్తోంది. కావ్య మారన్‌కే వారు షాకిచినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌లో ట్రోఫీ గెలవడానికి సదరు ఐపీఎల్ ఫ్రాంచైజీ వారిద్దరికీ ఆ డీల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవమేమిటనేది ఎప్పుడో అప్పుడో బయటకు రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









