KKR vs PBKS Highlights: డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. చావో రేవోలాంటి మ్యాచ్‌లో.. తప్పక గెలవాల్సి ఉండగా వర్షం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్‌తో జరుగాల్సిన మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ పూర్తవగా.. ద్వితీయార్థం ప్రారంభమైన కొద్దిసేపటికే వరుణుడు దూసుకొచ్చాడు. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే ఈ పాయింట్‌తో పంజాబ్ ముందడుగు పడగా.. ఓ రకంగా చూస్తే కేకేఆర్ కూడా ఒకడుగు ముందు వేసినట్టే చెప్పవచ్చు.
Also Read: Cars24 Lays Off: ఐపీఎల్‌లో, సొంత కంపెనీలో ధోనీకి కష్టాలు.. ఒక్కసారిగా 200 ఉద్యోగులను తొలగింపు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ప్రియాన్షు ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ చెలరేగి ఆడారు. టాపార్డర్ స్థానానికి వారిద్దరూ న్యాయం చేశారు. 35 బంతుల్లో 69 పరుగులు చేసిన ప్రియాన్షు ఆర్య 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో దుమ్మురేపాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ 49 బంతుల్లో 83 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 6 ఫోర్లు, 6 సిక్సర్‌లతో చెలరేగి ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 పరుగులకు పరిమితమవగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (7), మార్కో జెన్‌సన్ (3), జోష్ ఇంగ్లిష్ (11) తక్కువ పరుగులు చేశారు.
Also Read: CSK vs SRH: చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. విజయంతో హైదరాబాద్ ముందడుగు
తడబడ్డ కేకేఆర్ బౌలర్లు
సీజన్‌లో ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లు విఫలమయ్యారు. వెంటవెంటనే వికెట్లు తీయకపోవడమే కాకుండా పరుగులను కూడా నియంత్రించలేకపోయారు. వైభవ్ అరోరా పొదుపుగా బంతులు వేయడమే కాకుండా రెండు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, ఆండ్రె రస్సెల్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు సత్తా చాటలేకపోయారు.
భారీ స్కోర్ ఛేదనకు దిగిన కోల్‌కత్తా బ్యాటింగ్‌కు వరుణుడు అడ్డంకి సృష్టించాడు. కొన్ని నిమిషాల పాటు వేచి చూసినా కూడా వర్షం ఆగలేదు. ఏ పరిస్థితిలో కూడా మ్యాచ్ కొనసాగే అవకాశం లేకపోవడంతో అనివార్యంగా నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. లక్ష్యాన్ని కుదించి మ్యాచ్ కొనసాగించే పరిస్థితి కూడా ఏర్పడలేదు. రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ పూర్తయ్యాక వర్షం మొదలైంది. రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్ కలిసి ఏడు పరుగులు తీశారు. అయితే వర్షం ఎంట్రీతో మ్యాచ్‌ను కొనసాగించలేక రద్దు చేశారు.
మ్యాచ్ రద్దుతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. 9 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు, 3 పరాజయాలు తాజాగా మ్యాచ్ రద్దుతో మొత్తం 11 పాయింట్లను పంజాబ్ కింగ్స్ పొందింది. 9 మ్యాచ్‌లు ఆడగా మూడింట నెగ్గి ఐదింట కేకేఆర్ ఓడిపోయింది. తాజా మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ వేసుకున్న కేకేఆర్ మొత్తం 7 పాయింట్లతో కొనసాగుతోంది. కేకేఆర్‌కు ఇక ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు దూరంగా చేసుకున్నట్టే. పంజాబ్ కింగ్స్ విజయాలతో దూసుకెళ్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









