)
IPL 205 RCB vs GT Highlights: తాజా ఐపీఎల్ సీజన్లో సంచలన విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో తొలి పరాజయాన్ని అందుకుంది. శిష్యుడు శుభ్‌మన్ గిల్ చేతిలో గురువు విరాట్ కోహ్లీ జట్టు ఓడిపోయింది. రెండు విజయాలతో జోరు మీదున్న బెంగళూరుకు గుజరాత్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీపై 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (7)తో సహా టాపార్డర్ బ్యాటర్లు మొత్తం పరుగులు రాబట్టలేకపోయారు. దేవ్‌దత్ పడిక్కల్ (4), కెప్టెన్ రజత్ పాటిదర్ (12), ఫిల్ సాల్ట్ (14), కృనాల్ పాండ్యా (5) అతి తక్కువ పరుగులు చేశారు. అందరూ విఫలమవుతున్న వేళ లియాన్ లివింగ్స్టన్ (54) కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అర్థ సెంచరీ సాధించాడు. అతడికి జితేశ్ శర్మ భాగస్వామ్యం పంచుకుని 33 పరుగులు సాధించి స్కోర్ బోర్డును పెంచాడు. రెండు విజయాలతో జోరు మీదున్న బెంగళూరును గుజరాత్ బౌలర్లు బెంబెలెత్తించారు. మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, సాయి కిశోర్ తలా ఒక్కో వికెట్ తీశారు.
బెంగళూరు విధించిన 170 లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ టైటాన్స్ ఛేదించింది. 17.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోసారి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (14) భారీ స్కోర్ రాని పరిస్థితిలో సాయి సుదర్శన్ (49) తృటిలో అర్థ సెంచరీని మిస్సయ్యాడు. జోస్ బట్లర్ తనదైన బ్యాటింగ్‌తో 39 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 6 సిక్సర్లు, ఐదు ఫోర్లతో చెలరేగిపోయాడు. బట్లర్‌కు సహకరిస్తూనే రూథర్‌ఫోర్డ్ 30 పరుగులు సాధించాడు. బెంగళూరు బౌలర్లు పవర్‌ప్లేలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయగా.. దానిని ఆఖరు వరకు కొనసాగించలేకపోయారు. భువనేశ్వర్, హేజిల్‌వుడ్ తీసిన రెండు మినహా మిగతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
ముఖ్యాంశాలు
ఈ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాదాపు ఏడేళ్లు బెంగళూరు జట్టులో ఉన్న సిరాజ్ ఈ సీజన్ నుంచి గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. మొన్నటి వరకు ఆడిన బెంగళూరు జట్టుపైనే సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేసి ఆ జట్టును ఓడిపోయేలా చేశాడు. తనకు నిరంతరం ప్రోత్సహించిన విరాట్ కోహ్లీకి ప్రత్యర్థిగా సిరాజ్ ఆడడం గమనార్హం. ఇదే విషయాన్ని అవార్డులు ఇచ్చే సమయంలో సిరాజ్ చెప్పుకొచ్చాడు. తొలిసారి ఈ స్టేడియంలో వేరే జెర్సీపై ఆడడం కొంత భావోద్వేగంగా ఉందని సిరాజ్ చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీని గురువుగా భావించే శిష్యుడు శుభ్‌మన్ గిల్ పైచేయి సాధించాడు. కోహ్లీ మాదిరే స్కోర్ పరంగా నిరాశపర్చగా.. కానీ కెప్టెన్‌గా గురువుపై గిల్ విజయం సాధించడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe