Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు ముందు కీలక ప్లేయర్ అవుట్

ICC Champions Trophy Final May Miss Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 భారత జట్టును ఊరిస్తుండగా.. అద్భుత విజయాలతో ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు భారీ షాక్‌ తగిలినట్టు కనిపిస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌కు కీలక ప్లేయర్‌ దూరమవుతున్నాడనే వార్త సంచలనం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 6, 2025, 07:40 PM IST
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు ముందు కీలక ప్లేయర్ అవుట్

ICC Champions Trophy 2025 Final: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. సెమీ ఫైనల్ ఆస్డ్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కాలుకు గాయమైంది. హార్దిక్ పాండ్యా పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. కాలు బెణికినట్లు తెలుస్తోంది. దీంతో అతడు మైదానంలో కొంత ఇబ్బంది పడుతూ కనిపించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా హార్దిక్ అసౌకర్యంగానే ఉన్నట్టు కనిపించింది.

Add Zee News as a Preferred Source

Also Read: Double Bedroom Scheme: డబుల్ బెడ్రూమ్‌ పేరిట ఘరానా మోసం.. 200 మంది లబోదిబో

ఆ సమయంలోనే పాండ్యాకు గాయం కాకూడదని భారత అభిమానులు అందరూ దేవుడిని ప్రార్థించారు. అనుకున్నట్టుగానే పాండ్యా మైదానంలో నిలదొక్కుకోవడంతో భారత్‌ సెమీ ఫైనల్‌లో సంచలన విజయం పొందింది. అయితే పాండ్యాకు గాయమైందని.. ఇప్పుడు ఆ గాయం తీవ్రమైనది తెలుస్తోంది. దీంతో న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు హార్దిక్ దూరం కావాల్సి ఉంటుంది. గతంలో హార్దిక్ చీలమండ గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు అది మళ్లీ తిరగబెడుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హార్దిక్ గాయంపై జట్టు యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అతడు ఛాంపియన్స్‌ ట్రోఫీ తుది పోరు‌లో ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

Also Read: Konda Surekha Tears: విషాదంలో మంత్రి కొండా సురేఖ.. తట్టుకోలేక బోరున ఏడ్చేశారు

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించడంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది. దుబాయ్ వేదికగా టీమిండియా, కివీస్ జట్లు పోటీ పడనున్నాయి. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్‌ ఫైనల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందని భారత్‌ అభిమానులు భావిస్తున్నారు. లీగ్ దశలో ఎదురైన పరాభవానికి కసి తీర్చుకోవాలని న్యూజిలాండ్ ప్రణాళికలు రచిస్తోంది. మరి విజయం ఈ  రెండు జట్లలో ఎవరిని వరిస్తుందో ఆదివారం వరకు వేచి చూడాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News