)
India vs Australia 1st ODI Highlights: ఆస్ట్రేలియా గడ్డపై మూడు వన్డేల సిరీస్ కోసం వెళ్లిన టీమిండియా తొలి మ్యాచ్‌లోనే ఓటమిని ఎదుర్కొన్నది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పునరాగమనం చేసిన ఈ సిరీస్‌లో భారత్‌కు పరాజయం ఎదురవడం గమనార్హం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. వరుణుడి ఆటంకంతో సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి ఆధిపత్యంలోకి వచ్చింది.
పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటిం్కు దిగింది. వరుణుడి తీవ్ర ఆటంకం కలిగించడంతో 26 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. పలు అంతరాయాల తర్వాత మ్యాచ్ కొనసాగగా.. భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) మోస్తరు స్కోర్లు చేయగా.. నాలుగు నెలల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరగులు తీయడంతో ఘోరంగా విఫలమయ్యారు. హిట్ మ్యాన్ 8 పరుగులే తీయగా.. కోహ్లి డకౌట్ అయ్యాడు.
వన్డేల్లోకి అరంగేట్రం చేసిన నితీశ్ కుమార్ రెడ్డి 19 పరుగులు తీసి నాటౌట్‌గా నిలవగా.. రెండు సిక్సర్లు బాది జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తొలి మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోర్ చేశాడు. గిల్ 10 పరుగులకే పరిమితమవగా.. శ్రేయస్ అయ్యర్ తడబడుతూ 11 పరుగులు చేశాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యాడు. బౌలింగ్‌లో ఆసీస్ బౌలర్లు సత్తా చాటారు. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలా 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ ఒక్కో వికెట్ తీశారు.
డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 26 ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మిచెల్ మార్ష్ అద్భుతంగా ఆడి 46 పరుగులు తీసి నాటౌట్‌గా నిలవగా.. జోష్ ఫిలిప్ (37).. రెన్షా (21 నాటౌట్) రాణించారు. ట్రావిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) తక్కువ స్కోర్ చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలా ఒక్కో వికెట్ తీశారు. తొలి మ్యాచ్‌ను సొంతం చేసుకున్న ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి రాగా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23వ తేదీన అడిలైడ్ వేదికగా జరుగనుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook