Siraj Dating: టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ చుట్టూ ఈ మధ్య కాలంలో వార్తలు ఎక్కువే విన్పిస్తున్నాయి. సినిమా రంగానికి చెందిన ఒకరిద్దరితో సిరాజ్ ప్రేమాయణం అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొన్న ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు..ఇవాళ బాలీవుడ్ నటి మహిరా శర్మ. అసలు నిజమేంటో తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో మొహమ్మద్ సిరాజ్ ప్రేమాయణం వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోంస్లేతో సిరాజ్ డేటింగ్ అంటూ గట్టిగానే సోషల్ మీడియా పుకార్లు లేపింది. ఈ పుకార్లు ఎంతగా వైరల్ అయ్యాయంటే అటు మొహమ్మద్ సిరాజ్, ఇటు జనై భోస్లే ఇద్దరూ స్పందించాల్సి వచ్చింది. ముంబైలో జరిగిన జనై భోస్లే పుట్టినరోజు వేడుకలకు సిరాజ్ హాజరైన ఫోటోలతో నెటిజన్లు రెచ్చిపోయారు. జనై తనకు సోదరి లాంటిదని సిరాజ్, సిరాజ్ తనకు సోదరుడని జనై ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చాకే ఈ పుకార్లకు చెక్ పడింది.
ఇప్పుడు కొత్తగా మరో బాలీవుడ్ నటి మహిరా శర్మతో మోహమ్మద్ సిరాజ్ డేటింగ్ అంటూ మళ్లీ కథనాలు ప్రచారమౌతున్నాయి. మహిరా శర్మ పోస్ట్‌కు మొహమ్మద్ సిరాజ్ లైక్ కొట్టడం, ఇన్‌స్టాలో ఫాలో అవడంతో నెటిజన్లు ఎఫైర్ అంటూ మొదలెట్టేశారు. బాలీవుడ్ బ్యూటీ మహిరా శర్మతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇద్దరూ కొద్దిరోజులుగా డేటింగ్‌లో ఉన్నారని ఈ ఇద్దరి సన్నిహితులు చెప్పారంటూ ఇంగ్లీష్ వెబ్‌సైట్ బయటపెట్టింది. ఈ వార్తలపై ఇప్పుడు మహిళా శర్మ స్పందించింది.
ఈ విషయంలో చెప్పేందుకేమీ లేదని, ఎవరితో డేటింగ్ చేయడం లేదని మహిరా శర్మ తెలిపింది. ఫ్యాన్స్ ఎవరికి ఎవరితోనైనా రిలేషన్ పెట్టగలరని వ్యాఖ్యానించింది. గతంలో తాను పనిచేసిన కొందరు నటులతో కూడా ఇలానే ఎఫైర్స్ ప్రచారం చేశారని స్పష్టం చేసింది. అందుకే తాను ఇలాంటి పుకార్లను పట్టించుకోనని చెప్పుకొచ్చింది. అటు మహిరా శర్మ సైతం ఈ రూమర్లను ఖండించింది.
Also read: OTT Movies: తండేల్, మనమే సహా ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









