Free Journey Metro Rail Journey: క్రికెట్ ప్రపంచంలో ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభానికి సిద్ధమైంది. కొన్ని గంటల్లో ఈ మహా క్రీడా సంగ్రామం ప్రారంభం కానుండగా.. మ్యాచ్ వీక్షించే అభిమానులకు బంపర్ బొనాంజా తగిలింది. క్రికెట్ ప్రియులు అతికష్టంగా సంపాదించిన ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి చెన్నై మెట్రో శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మ్యాచ్ చూసే ప్రజలందరికీ ఉచిత మెట్రో రైలు రవాణా కల్పిస్తున్నట్లు శుభవార్త వెల్లడించింది. క్రికెట్ మ్యాచ్‌లు చూసే ప్రతి ప్రేక్షకుడికి ఉచితంగా మెట్రో రైలు రవాణా కల్పిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: IPL 2025 CSK Team: ఆరో టైటిల్ కోసం సిద్ధమౌతున్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేయింగ్ 11 ఇదే
తమిళనాడు తరఫున ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. విజిల్ పోడు అంటూ ఎల్లో ఆర్మీ ఐపీఎల్‌లో రచ్చ చేస్తోంది. ఎల్లో ఆర్మీకి తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మరి అలాంటి చెన్నై సూపర్ కింగ్స్ తమపై ఆదరభిమానులు చూపిస్తున్న ప్రేక్షకులకు అదిరిపోయే కానుక అందించింది. మ్యాచ్‌లకు వచ్చే ప్రతి ప్రేక్షకుడికి ఉచిత మెట్రో రైలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: IPL 2025 SRH Team: భారీ అంచనాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేయింగ్ 11 ఇదే
ఐపీఎల్ సీజన్‌లో ప్రయాణికులందరికీ చెన్నైలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ మెట్రో సంస్థ ప్రకటించింది. క్రికెట్ మ్యాచ్‌లు చూసే ప్రతి వీక్షకుడికి చెన్నై సూపర్ కింగ్స్‌తో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్‌లో జరిగే ప్రతి మ్యాచ్ కు వెళ్లే ప్రేక్షకుడికి ఉచిత ప్రయాణం అందించనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. మెట్రో స్టేషన్ నుంచి గవర్నర్‌మెంట్ ఎస్టేట్ వరకూ రాను పోను మెట్రో రైలు సేవలు క్రికెట్ వీక్షకులు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
ఉచిత ప్రయాణం
ఉచిత ప్రయాణ సదుపాయానికి సంబంధించిన కొన్ని నిబంధనలు విడుదల చేసింది. మ్యాచ్‌లు ఉన్న రోజులు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. మెట్రో రైలు సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. మ్యాచ్ జరిగిన రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మెట్రో రైలు సేవల వేళలను చెన్నై మెట్రో సంస్థ ప్రకటించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









