
CSK vs PBKS Highlights: సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ మరో పరాభవం తప్పలేదు. ఐపీఎల్లో అట్టడుగున ఉన్న చెన్నై తన స్థానాన్ని ఎవరికీ ఇవ్వకుండా పదిలం చేసుకుంటోంది. పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న చెన్నై ఈ సీజన్లో అత్యంత ఘోర ప్రదర్శన చేసింది. సామ్ కరన్ భారీ పరుగులు చేసినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు తోడు యుజువేంద్ర చాహల్ హ్యాట్రిక్ బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్‌కు భారీ విజయం లభించింది.
చెపాక్ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లకు 190 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్ షేక్ రషీద్ (11), ఆయుశ్ మాత్రే (7) ఘోరంగా విఫలమవగా.. సామ్ కరణ్ సంచలన ప్రదర్శన చేశాడు. 47 బంతుల్లో 88 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగాడు. ఆ తర్వాత డేవాల్డ్ బ్రేవిస్ 32 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ నామమాత్రపు స్కోర్ కూడా నమోదు చేయలేదు. రవీంద్ర జడేజా (17), శివమ్ దూబే (6), కెప్టెన్ ఎంఎస్ ధోనీ (11), దీపక్ హుడా (2) ఇలా అందరూ బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు.
చెన్నైపై పంజాబ్ బౌలర్లు పంజా విసిరారు. యుజువేంద్ర చాహల్ ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. హ్యాట్రిక్ వికెట్లతోపాటు మరో వికెట్ తీసి మొత్తం 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో హ్యాట్రిక్ వికెట్ తీసిన తొలి బౌలర్‌గా చాహల్ నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్, మార్కో జేన్సన్ రెండు వికెట్ల చొప్పున తీయగా.. అజ్ముల్లా ఓమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీశారు.
పంజాబ్ కింగ్స్ సమష్టి కృషి
గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సమష్టి కృషి చేసింది. 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 23 పరుగులకే ఔటవగా.. ప్రభు సిమ్రాన్ సింగ్ అర్ధ శతకంతో అదరగొట్టాడు. 36 బంతుల్లో 54 పరుగులు చేసి 5 ఫోర్లు, 3 సిక్సర్లతో రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీ స్కోర్ చేసి మరోసారి తన విలువను చాటి చెప్పాడు. 41 బంతుల్లో 72 పరుగులు చేసి దుమ్మురేపాడు. 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాది విలువైన ఇన్నింగ్స్ శ్రేయస్ ఆడాడు. నేహాల్ వదెరా (5) నిరాశపర్చగా.. శశాంక్ సింగ్ 23 పరుగులతో జట్టుకు కావాల్సిన గెలుపు రన్స్‌ను సాధించాడు. సూర్యాన్ష్ హెగ్డే ఒక పరుగుకే ఔటవగా.. జోష్ ఇంగ్లీస్, మార్కో జెన్సన్ కొన్ని పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు.
అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌లో బౌలర్లు కూడా ఓటముల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లపై మొదట చేతులెత్తేసిన బౌలర్లు అనంతరం పట్టుసాధించినా కూడా చివరి వరకు కొనసాగించలేకపోయారు. ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. బౌలర్లకు తోడు క్యాచ్‌లు వదిలిపెట్టడం జట్టుకు పరాభవం పట్టింది.
ఫెయిల్యూర్ జట్టు
హ్యాట్రిక్ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల సంఖ్య 8కి చేరాయి. ఆడిన 10 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచి 8 మ్యాచ్‌లను ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ఎల్లో ఆర్మీ మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే కొంత పరువు నిలబెట్టుకుంది. లేకపోతే అత్యంత ఫెయిల్యూర్ జట్టుగా ముద్ర వేసుకుంటుంది. నిలకడగా ఆడుతూ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంటున్న పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సొంతం చేసుకోగా.. ఐదు ఓటములను చవిచూసింది. పంజాబ్ ప్రదర్శన ఇదే స్థాయిలో కొనసాగితే సీజన్లో ముందడుగు వేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి