CSK vs SRH: చెన్నై ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. విజయంతో హైదరాబాద్‌ ముందడుగు

Sunrisers Hyderabad Beat Chennai Super Kings By 5 Wickets: దిగ్గజ జట్టుగా దశాబ్దాలపాటు గుర్తింపు పొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్పోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన్ని నిలబెట్టుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 25, 2025, 11:39 PM IST
CSK vs SRH: చెన్నై ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. విజయంతో హైదరాబాద్‌ ముందడుగు

CSK vs SRH Highlights: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రెండు జట్లు తలపడగా వాటిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలిచి కాస్త పరువు నిలబెట్టుకోంది. సొంత మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్పోయింది. ఏ రకంగా చూసినా కూడా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయదు. హైదరాబాద్‌ గెలిచినా కూడా ప్లేఆఫ్స్‌ అవకాశాలు కూడా కష్టంగానే ఉన్నాయి. కానీ అవకాశాలను మెరుగుపర్చుకుంది. 5 వికెట్ల తేడాతో చెన్నైపై హైదరాబాద్‌ విజయం సాధించింది.

Add Zee News as a Preferred Source

Also Read: Tamanna Bhatia: హీరోయిన్ తమన్నాకు భారీ షాక్.. వివాదంలో 'ఓదెల -2 సినిమా

సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతి కష్టంగా 154 పరుగులు చేసి ఒక బంతి మిగిలి ఉండగానే ఆలౌటైంది. బ్యాటింగ్‌ ఫామ్‌లో లేకపోవడంతో వరుస ఓటములు ఎదుర్కొంటున్న జట్టు ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్‌ చేయలేదు. ఏ బ్యాటర్‌ కూడా భారీ స్కోర్‌ చేయకపోవడం విశేషం. షేక్‌ రషీద్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. ఆయుశ్‌ మాత్రే 30 పరుగులతో సత్తా చాటగా.. సామ్‌ కరన్‌ (9), శివమ్‌ దూబే (12), కెప్టెన్‌ ధోనీ (6), అన్షుల్‌ (2), నూర్‌ అహ్మద్‌ (2) అతి తక్కువ పరుగులు చేశారు. డేవాల్డ్‌ బ్రేవిస్‌ 42 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలవగా.. అతడికి కొంత సహకరించిన దీపక్‌ హుడా 22 పరుగులు చేశాడు. విజయం కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్‌ బౌలర్లు ప్రత్యర్థిని భారీ పరుగులు చేయకుండా నియంత్రించారు. దాదాపుగా అందరూ బౌలర్లు చక్కటి బౌలింగ్‌ వేసి స్కోర్‌ బోర్డుకు కళ్లెం వేసి చివరకు ఆలౌట్‌ చేశారు. హర్షల్‌ పటేల్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేసి నాలుగు వికెట్లను పడగొట్టి చెన్నై బ్యాటర్లను ఊచకోత కోశాడు. కెప్టెన్‌ కమిన్స్‌, జయదేశ్‌ ఉనద్కట్‌ తలా రెండు వికెట్ల చొప్పున తీయగా.. మెండీస్‌, షమీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Also Read: LSG vs DC: ఢిల్లీ జోరు.. లక్నో బేజారు.. ప్లేఆఫ్స్‌లో 'క్యాపిటల్స్‌' పక్కా

చెన్నై నిర్దేశించిన తక్కువ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్ల నష్టానికి 18.4 పరుగులు చేసి ఛేదించింది. గెలుపు నల్లేరుపై నడక అయినా కూడా కొంత కష్టపడి గెలిచింది. అభిషేక్‌ శర్మ ఒక్క పరుగు తీయలేకపోగా ట్రావిస్‌ హెడ్‌ 19 పరుగులు చేశాడు. ఇషాన్‌ కిషన్‌ 44 పరుగులతో భారీ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్‌ 7 పరుగులకే ఔటయ్యాడు. అనికేత్‌ వర్మ 19 పరుగులు చేయగా.. కమిండు మెండిస్‌ 32* పరుగులతో చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. నితీశ్‌ కుమార్‌ 19* పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లు చక్కటి బౌలింగ్‌ వేసినా కూడా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. వికెట్లు తీయడానికి చాలా కష్టపడినా కూడా ప్రత్యర్థి బ్యాటర్లు గ్రౌండ్‌లోనే ఉండిపోయారు. చెన్నై తరఫున నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీయగా.. అన్షుల్‌, ఖలీల్‌ చెరో ఒక్కో వికెట్‌ తీశారు.

ప్రతి మ్యాచ్‌ తప్పక గెలవాల్సిందే
ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్న జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. 9 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు.. 7 ఓటములతో చెన్నై సూపర్‌కింగ్స్‌ చివరి నుంచి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్పోయిన చెన్నై ఈ టోర్నీలో ఏ లెక్కల పరంగా చూసినా చెన్నై తదుపరి దశకు చేరదు. ఓటముల్లో చెన్నైతో పోటీ పడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ విజయంతో కాస్త మెరుగుపడింది. 9 మ్యాచ్‌లు ఆడి మూడింట విజయం సాధించి.. 6 మ్యాచ్‌లను కోల్పోయిన సన్‌రైజర్స్‌ పరిస్థితి కొంత మెరుగుపడింది. ప్లేఆప్స్‌ చేరాలంటే ఇకపై ప్రతి మ్యాచ్‌ తప్పక గెలవాల్సిందే. కానీ ప్రత్యర్థి సొంత గడ్డలో ఓడించి హైదరాబాద్‌ సత్తా చాటింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News