ధోనీ మార్క్ పంచ్ పేలింది.. Dhoni Is Back అంటున్న ఫ్యాన్స్
MS Dhoni Funny Comments: చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో కనిపించి తన అభిమానులలో నూతనోత్సాహాన్ని నింపాడు. ధోనీ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే తనదైన మార్క్ పంచ్ విసిరాడు. కీపర్లకు సోషల్ డిస్టెన్సింగ్‌పై ధోనీ పేల్చిన జోక్ వైరల్ అవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభ వేడుక లేకుండా, ప్రేక్షకుల సందడి లేకుండానే మొదలైంది. అబుదాబి ఇందుకు వేదికగా మారింది. ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత రిపోర్టర్లతో ధోనీ మార్కు ఇంటర్వ్యూలు కరోనా కారణంగా ఈసారి చూడలేము. అయితే తన కెప్టెన్సీలోనే కాదు, కామెడీ టైమింగ్‌లోనూ ఎంఎస్ ధోనీ (MS Dhoni funny comments)కి సరిలేరు నీకెవ్వరు అని ఫ్యాన్స్ అంటున్నారు. MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ
ఎంఎస్ ధోనీ సోషల్ డిస్టెన్సింగ్ జోక్..
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ప్రారంభం నేపథ్యంలో వికెట్ కీపర్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలా అని అడుగుతూ ఎంఎస్ ధోనీ తనదైన మార్క్ పంచ్ విసిరాడు. అది కూడా క్రికెట్‌కు, సోషల్ డిస్టెన్సింగ్‌కు సంబంధించింది కావడంతో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 13 తొలి మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో మహీ తన మార్క్ కామెడీ పండించాడు. ఐపీఎల్‌లో కీపర్‌కు భౌతికదూరం (Social Daistancing)పై జోక్ పేల్చాడు. ‘మ్యాచ్‌లో వికెట్ కీపర్ (నా) పక్కన ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచవచ్చా, కోవిడ్19 నిబంధనల ప్రకారం సోషల్ డిస్టెన్స్ ఏమైనా పాటించాలా. నేను దీనిపై రిఫరీని ముందుగానే అడిగానంటూ’ ధోని నవ్వులు పూయించాడు. Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి
కాగా, 437 రోజుల తర్వాత ఎంఎస్ ధోనీ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి (జులై 10, 2019) తర్వాత ఐపీఎల్ 2020తో తిరిగి బరిలోకి దిగాడు మహీ. తొలి మ్యాచ్‌లోనే ముంబై జట్టుపై చెన్నైకి విజయాన్ని అందిస్తూ కెప్టెన్‌గా తన మార్కు చూపించాడు. IPL 2020: రెచ్చిపోయిన అంబటి రాయుడు.. ఐపిఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సేన విజయం
ఫొటో గ్యాలరీలు
Sushant Singh Rajput Wax Statue: సుశాంత్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. Photos
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR