MS Dhoni Lightning Stump: అంత వేగం ఎలా సాధ్యం, వైరల్ అవుతున్న ధోని స్టంపింగ్ వీడియో

MS Dhoni Lightning Stump: ఐపీఎల్ అంటేనే అద్భుతాల వేదిక. తాజాగా మరో మిరాకిల్ జరిగింది. రెప్పపాటు వేగంతో టీమ్ ఇండియా మాజీ సారధి ఎంఎస్ ధోని చేసిన స్టంప్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2025, 08:21 AM IST
MS Dhoni Lightning Stump: అంత వేగం ఎలా సాధ్యం, వైరల్ అవుతున్న ధోని స్టంపింగ్ వీడియో

MS Dhoni Lightning Stump: ఐపీఎల్ 2025 సీజన్ 18 మూడవ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు , టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన స్టంప్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టంపింగ్ వేగం చూసి అందరి మతులు పోయాయి. మరీ ఇంత వేగమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. 

ఇంగ్లీషులో వేగాన్ని వివిధ రూపాల్లో చెప్పుకోవాలంటే ఫాస్ట్...ఫాస్టర్..ఫాస్టెస్ట్ అంటారు. ఇక్కడ చివర్లో ఫాస్టెస్ట్ తొలగించి ధోని అని తగిలించాల్సిందే. ఎందుకంటే వేగానికి పర్యాయపదంగా మారాడు ఎంఎస్ ధోని. ఆదివారం మార్చ్ 23న చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మూడవ మ్యాచ్ సీఎస్కే వర్సెస్ ఎంఐలో జరిగిన మ్యాజికల్ స్టంపింగ్ దీనికి కారణం. వయస్సు ధోనికి కాదు చూసే కళ్లకు అని నిరూపించాడు. మరీ ఇంత వేగంగా స్టంపింగ్ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కేవలం 0.12 సెకన్ల వ్యవధిలో స్టంప్ చేయడంతో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ షాక్ అయి చూస్తుండిపోయాడు. కనీసం అప్పీల్ కూడా చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయాడు.

ప్రారంభంలోనే 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను తిలక్ వర్మతో కలిసి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. 36 పరుగులకే ఎంఐ మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో సూర్యకుమార్ యాదవ్ తిలక్ కలిసి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతలో నూర్ అహ్మద్ వేసిన గూగ్లీ బాల్‌ను సూర్య కుమార్ యాదవ్ మిస్ అయ్యాడు. ఆ ప్రయత్నంలో అతని అడుగు క్రీజ్‌కు కేవలం ఒక్క అడుగు ముందు ఉంది. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో కాలు అడుగుపెట్టేలోగా అంటే కేవలం 2 సెకన్ల వ్యవధిలో వికెట్లు గిరాటేశేశాడు. బాల్ ఎప్పుడు పట్టాడో తెలియదు, సూర్య కుమార్ కాలు క్రీజ్ బయట ఉందని ఎప్పుడు చూశాడో తెలియదు కన్ను మూసి తెరిచేంత వేగంతో స్టంప్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు.

ఎంఎస్ ధోని వయస్సు ఇప్పుడు 43 ఏళ్లు. మరో మూడు నెలల్లో 44 ఏళ్లకు చేరుకుంటాడు. ఇప్పటికీ ఫిట్‌గా నిశిత దృష్టితో ఉంటాడు. తాను వీల్ చైర్‌లో ఉన్నా సీఎస్కే యాజమాన్యం తనను జట్టులో తీసుకుంటుందని ధోని సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంత వేగంగా స్టంపింగ్ చేసే ఫిట్నెస్ ఉంది కాబట్టే సీఎస్కే యాజమాన్యం ధోనీని వదల్లేకపోతోంది.ప్రస్తుతం ఈ ఫాస్టెస్ట్ స్టంపింగ్ వైరల్ అవుతోంది

Also read: CSK Vs MI: తొలి మ్యాచ్ లోనే ముంబైకి షాక్.. చెన్నై విజయారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News