IPL 2025: భలే తొందరగా వచ్చాడుగా... ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై స్టార్ ప్లేయర్‌ కౌంటర్లు

IPL 2025: ఐపీఎల్ 2025లో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్  కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. దీంతో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ పై సెహ్వాగ్ సెటైర్లు వేశారు. ముందు రావొద్దని డిసైడ్ అయ్యాడా అంటూ ప్రశ్నించాడు.   

Written by - Bhoomi | Last Updated : Mar 29, 2025, 04:19 PM IST
IPL 2025: భలే తొందరగా వచ్చాడుగా... ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై స్టార్ ప్లేయర్‌ కౌంటర్లు

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో 50 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత , మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై పెద్ద చర్చ చెలరేగింది . 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానీ అతని ఇన్నింగ్స్ ఏమీ అర్థం కాలేదు. RCB అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ దూకుడుగా ఆడాడు. దీంతో మహీ ఆ స్థానంలో కాకుండా ఇంకాస్త ముందుగా వచ్చి ఉంటే ఫలితం మారేదేమో అంటూ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Add Zee News as a Preferred Source

టీమిండియా మాజీలు సెహ్వాగ్ , మనోజ్ తివారి మ్యాచ్ తర్వాత ఓ స్పోర్ట్స్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఇందులో ధోనీ 9వ స్థానంలో రావడం ఏంటని యాంకర్ అడగగానే స్పెహ్వాగ్ స్పందించాడు. వాస్తవానికి ధోనీ ఈ మ్యాచులో కాస్త త్వరగానే బ్యాటింగ్ కు వచ్చాడని సెటైర్ వేశాడు. 

Also Read: Gold Rate Today: ఉగాదికి ముందే దుమ్మురేపిన బంగారం ధరలు..ఎంత పెరిగిందో తెలిస్తే పిచ్చెక్కడం ఖాయం  

ధోనీ తొందరగానే బ్యాటింగ్ కు వచ్చాడు. సాధారణంగా తను 19లేదా 20వ ఓవర్లో బ్యాటింగ్ కు దిగుతాడు. కానీ నేడు 16వ ఓవర్లోనే క్రీజులోకి వచ్చాడు. అంటే తొందరగా వచ్చినటే కదా అంటూ సెటైర్స్ వేశాడు. డెత్ ఓవర్స్ కు ముందు బ్యాటింగ్కు రాకూదని నిర్ణయించుకున్నట్లు ఉన్నాడేమో. అయితే నేడు అతను కాస్తు ముందు వచ్చాడు. లేదంటే వాళ్ల బ్యాటర్లు త్వరత్వరగా ఔటైనట్లున్నారు అని సెహ్వాగ్ సరదా కామెంట్స్ చేశాడు. 

IPL 2025: ధోనీని ఎంతైనా తిట్టుకోండి.. ఈ రికార్డు మాత్రం మీ ఫేవరెట్‌ ప్లేయర్‌ జన్మలో చేరుకోలేడు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News