CSK Vs MI: తొలి మ్యాచ్ లోనే ముంబైకి షాక్.. చెన్నై విజయారంభం..

CSK Vs MI Highlights In Telugu: చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. స్వల్ప స్కోర్ ను చెన్నై కొంత కష్టంగా చేధించింది. తొలి మ్యాచ్ లో ముంబైపై దూకుడుగా ఆడి చెన్నై శుభారంభం చేసింది.  

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 23, 2025, 11:54 PM IST
 CSK Vs MI: తొలి మ్యాచ్ లోనే ముంబైకి షాక్.. చెన్నై విజయారంభం..

CSK Vs MI Match: రెండు దిగ్గజ జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నై పైచేయి సాధించగా.. ముంబై తొలి మ్యాచ్ లోనే డీలా పడిపోయింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విజయారంభం చేసింది. తక్కువ ప‌రుగుల‌కే ముంబై లక్ష్యం విధించగా కొంత కష్టపడే సీఎస్కే మ్యాచ్ ను సొంతం చేసుకుంది. నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై విజయం సాధించింది. ముంబై 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగా.. చెన్నై 19.1 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 158 స్కోర్ సాధించి విజయం వైపు నిలిచింది. అయితే తక్కువ స్కోర్ నే ఆఖరి ఓవర్ వరకు చెన్నై తీసుకెళ్లిదంటే అభిమానుల్లో కలవరం ఏర్పడింది. ఒక విధంగా పోరాడి గెలిచింది.
చిదంబరం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ – ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య రసవత్తరంగా తొలి మ్యాచ్ జ‌రిగింది. మ్యాచ్ లో సీఎస్కే బౌల‌ర్లు చెల‌రేగి ఆడగా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి ముంబై ఇండియన్స్ 155 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. నూర్ అహ్మ‌ద్ (4/18), ఖ‌లీల్ అహ్మ‌ద్ (3/29) ముంబై బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించారు. దీంతో ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (31) అత్యధిక స్కోరర్ గా నిలవగా.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29), దీప‌క్ చాహ‌ర్ (28), న‌మ‌న్ ధీన్ (17) కొంత ప‌రుగులు సాధించారు. మిగిలిన‌ బ్యాటర్లు రాణించ‌లేక‌పోయారు. సీఎస్కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ నాలుగు వికెట్లు తీసి ముంబైకి ముచ్చెమటలు పట్టించగా.. ఖ‌లీల్ అహ్మ‌ద్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. నాథన్ ఎల్లిస్, అశ్విన్ త‌లా ఒక వికెట్ ద‌క్కించుకున్నారు. చెన్నై జట్టు 156 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది
జట్లు ఇలా..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివం దుబే, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్

Add Zee News as a Preferred Source

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News