IPL 2025 Highlights: వరుస విజయాలతో దూసుకెళ్తున్న రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతం చేసింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఢిల్లీ చిత్తుగా ఓడించింది. హ్యాట్రిక్ విజయాలతో జోరులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుని తిరుగులేని జట్టుగా నిలిచింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరు నుంచి ఢిల్లీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ సంచలన ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.
Also Read: Captain MS Dhoni: మళ్లీ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ.. ఇక చెన్నై సూపర్ కింగ్స్ దశ మారుతుందా?
చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతి తక్కువ పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి బెంగళూరు 163 పరుగులు చేసింది. ఏ ఒక్క బ్యాటర్ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఫిల్ సాల్ట్ (37)తో కలిసి విరాట్ కోహ్లీ (22) కొంత పరుగులు రాబట్టారు. దేవదత్ పడిక్కల్ ఒక్క పరుగుకే పరిమితమవగా.. రజత్ పాటిదర్ 25 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్‌స్టన్ (4), జితేశ్ శర్మ (3), కృనాల్ పాండ్యా (18) తలా కొన్ని పరుగులు చేయగా.. ఆఖరులో టిమ్ డేవిడ్ 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ చేశాడు.
Also Read: RR vs GT: సాయి సుదర్శన్ కుమ్ముడు.. గుజరాత్ దూకుడు.. రాజస్థాన్‌కు మరో ఓటమి
బెంగళూరు బేజారు
స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అతి సునాయాసంగా ఛేదించింది. 17.5 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి విజయం సాధించింది. టాపార్డర్ ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (7), అభిషేక్ పారేల్ (7) ఘోరంగా విఫలమవగా.. నాలుగో బ్యాటర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ దుమ్మురేపాడు. రాహుల్ 53 బంతుల్లో 93* పరుగులతో రఫ్పాడించాడు. 7 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ సీజన్‌లో రాహుల్‌కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్ తనదైన నాయకత్వం వహించి విజయాన్ని అందించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (15) తక్కువ స్కోర్‌కు పరిమితమవగా.. త్రిస్టన్ స్టబ్స్ 38 పరుగులు చేశాడు. బ్యాటర్లు అతి తక్కువగా నిలిపిన స్కోర్‌ను బెంగళూరు బౌలర్లు కాపాడలేకపోయారు. ప్రత్యర్థి పరుగులను నియంత్రించడంలో విఫలమయమై మ్యాచ్‌ను చేజార్చుకుంది. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలా వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన ఢిల్లీ
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్ నుంచి ఓటమి ఎరుగకుండా అన్నింటా విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లను కైవసం చేసుకుని ఈ సీజన్‌లో మోస్ట్ ఫేవరెట్ జట్టుగా నిలుస్తోంది. ఇదే జోరుతో ఢిల్లీ దూసుకెళ్లితే ట్రోఫీని సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. అన్ని రంగాల్లో జట్టు బలంగా ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. మరి చూడాలి తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ ఇదే స్థాయి ప్రదర్శన చేస్తుందో.. లేదంటే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటునేది రానున్న రోజులు సమాధానం చెబుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









