Digvesh Rathi: నువ్వు దేవుడివి సామి.. 5 బంతుల్లో 5 వికెట్లు.. విధ్వంసమంటే ఇదే కదా భయ్యా..!!

Digvesh Rathi takes 5 wickets in 5 balls: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రతి 13 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.  తన టైట్ బౌలింగ్,  'నోట్‌బుక్ సెలబ్రేషన్' కోసం కూడా వార్తల్లో నిలిచాడు.  దీనికి అతను జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు దేశీయ క్రికెట్‌లో రతి 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టడం మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. ఎక్స్ ట్రాలే కాదు..ఫెర్మామెన్స్ కూడా అదుర్స్ అనిపించుకున్నాడు. 

Written by - Bhoomi | Last Updated : Jun 17, 2025, 10:43 AM IST
Digvesh Rathi: నువ్వు దేవుడివి సామి.. 5 బంతుల్లో 5 వికెట్లు.. విధ్వంసమంటే ఇదే కదా భయ్యా..!!

Digvesh Rathi takes 5 wickets in 5 balls: లక్నో సూపర్ జెయింట్స్ యువ స్పిన్నర్ దిగ్వేష్ రతి సంచలనం క్రియేట్ చేశాడు. 5 బంతుల్లో 5 వికెట్లు తీసి అందరి నోళ్లు మూయించాడు. ఐపీఎల్ 2025 సీజన్ వివాదాస్పద నోట్ బుక్ సెలెబ్రేషన్స్ తో తరచూ వార్తల్లో నిలిచాడు దిగ్వేష్ రతి. తాజాగాఓ లోకల్ టీ 20 లీగ్ లో వరుసగా5 బంతుల్లో 5 వికెట్లు తీసాడు. ఇందులో 4బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేయగా..మరో బ్యాటర్ మాత్రం వికెట్ల ముందు దొరికాడు. 

Add Zee News as a Preferred Source

 దీనికి సంబంధించిన వీడియో లక్నో సూపర్ జెయింట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది ఏ టోర్నీది అనేది దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా మాత్రం తన పోస్టులో స్థానిక టీ 20 లీగ్ అంటూ పేర్కొన్నారు. దీంతో ఇదొక టీ20లీగ్ లో జరిగిందన్న విషయం స్పష్టమవుతోంది. 

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త..నేడు జూన్ 17వ తేదీ మంగళవారం బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా?  

ఈ మ్యాచులో దిగ్వేష్ ర తి 3.5 ఓవర్లు బౌలింగ్  చేసి 28 పరుగులు ఇచ్చాడు. 7 వికెట్లు పడగొట్టాడు. అప్పటికే మూడు ఓవర్లు బౌలింగ్ వేసాడు. తన ఆఖరి ఓవర్ లో అరుదైన ఫీట్ సాధించాడు. మిస్టరీ గూగ్లిలతో బ్యాటర్లను భయపెట్టాడు. ఐపీఎల్ 2025సీజన్ లో దిగ్వేష్ రతీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. 13 మ్యాచుల్లో 14 వికెట్లు తీసుకున్నాడు. అయితే వికెట్ తీసిన తర్వాత నోట్ బుక్ సెలబ్రేషన్స్ తో అతిగా ప్రవర్తించి రెండుసార్లు జరిమానాకు గురయ్యాడు. సర్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మతో గొడవకు దిగడంతో ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. 

 

Also Read: Zee గ్రూప్ కీలక నిర్ణయం: రూ.2237 కోట్లు ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా ప్రమోటర్ల పెట్టుబడి… షేర్‌హోల్డర్లు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News