IND vs SA: రేపటి నుంచే భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?

India Vs South Africa: ద‌క్షిణాఫ్రికా టీమ్ ప్రస్తుతం భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉంది. టెస్టు సిరీస్‌ను ద‌క్షిణాఫ్రికా క్లీన్ స్లీప్ చేసుకోగా వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. ఇక 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌  మంగ‌ళ‌వారం, డిసెంబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఎవ‌రు విన్ అవుతారోన‌ని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Written by - Aruna Maharaju | Last Updated : Dec 8, 2025, 03:30 PM IST
IND vs SA: రేపటి నుంచే భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?

Tomorrow India Vs South Africa T20 Match: ద‌క్షిణాఫ్రికా టీమ్ ప్రస్తుతం భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉంది. టెస్టు సిరీస్‌ను ద‌క్షిణాఫ్రికా క్లీన్ స్లీప్ చేసుకోగా వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. ఇక 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌  మంగ‌ళ‌వారం, డిసెంబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఇందునలో ఎవ‌రు విన్ అవుతారోన‌ని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా శుభ్‌మ‌న్ గిల్ గాయ‌ప‌డ్డాడు. కేవ‌లం మూడు బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న గిల్ కి మెడ ప‌ట్టేయడంతో.. అత‌డు మైదానాన్ని వీడాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో గిల్ బ్యాటింగ్‌కు దిగలేదు. ఈ క్ర‌మంలో రెండో టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. అయితే ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య 31 టీ20 మ్యాచ్‌లు జ‌రిగాయి. ఇందులో భార‌త్ 18 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. 12 మ్యాచ్‌ల్లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. ఇక స్వ‌దేశంలో భార‌త్ 5 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా.. ద‌క్షిణాఫ్రికా 4 మ్యాచ్‌ల్లో గెలిచింది.

టీ20 మ్యాచ్ ఎక్క‌డ ఫ్రీగా చూడొచ్చంటే..?
టీ20 సిరీస్‌లోని మ్యాచ్‌లు టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్నాయి. ఇక ఆన్‌లైన్‌, మొబైల్ ఫోన్‌ల‌లో జియో హ‌ట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సిమ్ వినియోగ‌దారులు ప్ర‌త్యేక రిచార్జ్‌ ఫ్లాన్స్ క‌లిగి ఉంటే.. వారికి జియో హ‌ట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా వ‌స్తుంది. హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్న‌వారు మ్యాచ్‌ల‌ను ఉచితంగా చూడొచ్చు.

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
1. తొలి టీ20-డిసెంబర్ 9న‌ (కటక్)
2. రెండవ టీ20-డిసెంబర్ 11న‌ (ముల్లాన్‌పూర్)
3. మూడవ టీ20-డిసెంబర్ 14న‌ (ధర్మశాల)
4. నాలుగవ టీ20-డిసెంబర్ 17న (లక్నో)
5. ఐదవ టీ20-డిసెంబర్ 19న‌ (అహ్మదాబాద్)

టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

Also Read: Kohli-Rohit: రో-కో జోడి ఇక మళ్లీ కనిపించేది వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 11వ తేదీనే.. ఎందుకో తెలుసా..?

Also Read: Rohit Sharma: దక్షిణాఫ్రికాతో మూడవ వన్డే.. రోహిత్ శర్మ అరుదైన ఘనత.. సచిన్, ద్రవిడ్, కోహ్లీ సరసన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News