WTC 2025 Prize Money: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. ఆస్టేలియాను చిత్తు చేసి డబ్ల్యూటీసీ గదను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా కంగారులను ఓడించింది. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. రెండూ ఫైనల్‌లో భారత్‌ను ఓడించాయి. ఈసారి కంగారూ జట్టు టైటిల్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికా 1998 తర్వాత మొదటిసారి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
Also Read: Kannappa Movie Trailer: అద్దిరిపోయిన కన్నప్ప ట్రైలర్.. ప్రభాస్ పాత్ర ఏమిటో తెలుసా?
భారీ బహుమతి డబ్బు
గత రెండు ఎడిషన్లతో పోలిస్తే 2023-25 ఎడిషన్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. 2021, 2023లో మొత్తం ప్రైజ్ మనీ 3.8 మిలియన్లు (సుమారు రూ.32.49 కోట్లు) ఉంది. ఈసారి దాదాపు రూ.49 కోట్లు వెచ్చించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు డబుల్ జాక్‌పాట్ తగిలింది. గతానికి కన్నా ఈసారి నగదు ప్రోత్సాహాకాన్ని ఐసీసీ రెండింతలు చేయడంతో జట్టుకు భారీగా నగదు బహుమతి లభించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో పాల్గొనే తొమ్మిది జట్లకు ఐసీసీ భారీ నగదు మొత్తాన్ని అందించింది. మొత్తంగా ఐసీసీ ప్రైజ్ మనీగా 5.76 మిలియన్లు డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.49.24 కోట్లు ఖర్చు చేసింది.
Also Read: Anushka Shetty: 'వేశ్య'గా అనుష్కను చూసి ఘోరం.. నడిరోడ్డుపై 40 యాక్సిడెంట్లు
విజేత, రన్నరప్‌కు..
విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికాకు 3.6 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 30.78 కోట్లు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు 2.16 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.18.56 కోట్లు నగదు బహుమతి లభించింది. మూడో స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఈసారి 1.44 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.12.13 కోట్లు నగదు బహుమతి లభించింది.
| జట్టు | పరిస్థితి | డాలర్లలో మొత్తం | భారత రూపాయలలో మొత్తం (సుమారుగా) |
| దక్షిణాఫ్రికా | విజేత | 3,600,000 | 30.78 కోట్లు |
| ఆస్ట్రేలియా | రన్నరప్‌లు | 2,160,000 | 18.56 కోట్లు |
| భారతదేశం | మూడవ స్థానం | 1,440,000 | 12.13 కోట్లు |
| న్యూజిలాండ్ | నాల్గవ స్థానం | 1,200,000 | 10.26 కోట్లు |
| ఇంగ్లాండ్ | ఐదవ స్థానం | 960,000 | 8.20 కోట్లు |
| శ్రీలంక | ఆరవ స్థానం | 840,000 | 7.18 కోట్లు |
| బంగ్లాదేశ్ | ఏడవ స్థానం | 720,000 | 6.15 కోట్లు |
| వెస్టిండీస్ | ఎనిమిదవ స్థానం | 600,000 | 5.13 కోట్లు |
| పాకిస్తాన్ | తొమ్మిదవ స్థానం | 480,000 | రూ. 4.10 కోట్లు |
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









