Betting App Case: సురేశ్ రైనా, శిఖర్‌ ధావన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు సీజ్

Betting App Promotion Case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బిగ్ షాకిచ్చింది. ఈ కేసులో వారిద్దరికి సంబంధించి రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Written by - Aruna Maharaju | Last Updated : Nov 6, 2025, 05:47 PM IST
Betting App Case: సురేశ్ రైనా, శిఖర్‌ ధావన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు సీజ్

Suresh Raina-Shikhar Dhawan Betting App Case: భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు బిగ్ షాక్ తగిలింది. వారి ఆస్తులు జప్తు అయ్యాయి. మొత్తం 11.14 కోట్ల రూపాయల మేర ఆస్తులు అటాచ్ అయ్యాయి. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. వారి ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆస్తులను జప్తు చేయడానికి గల కారణాలను ఇందులో వివరించింది.

Add Zee News as a Preferred Source

సురేష్ రైనా, శిఖర్ ధావన్.. ప్రస్తుతం మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, వాటికి సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో నటించినందుకు వాళ్లిద్దరూ ఈడీ రాడార్‌లోకి వచ్చారు. 1xBet బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసు వారిపై గతంలో నమోదైంది. ఇదే అంశంపై గతంలో వీరిద్దరి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు కొనసాగించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

1xBet మనీలాండరింగ్ కేసులో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లలో నటించినందుకు.. అలాగే ఆ తర్వాత వాటిని ప్రమోట్ చేసినందుకు ఆయా సంస్థల నుంచి మనీలాండరింగ్ రూపంలో రెమ్యునరేషన్ పొందారని నిర్ధారించారు. ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడా పొందుపర్చకపోవడం, ఆదాయపు పన్ను చెల్లింపుల్లో ఈ రెమ్యునరేషన్ గురించి వివరించకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.

దీంతో తాజాగా చర్యలకు దిగారు. తొలి విడతలో సురేష్ రైనా, శిఖర్ ధావన్‌‌కు సంబంధించి మొత్తం 11.14 కోట్ల రూపాయలను జప్తు చేశారు. వీటిని అటాచ్ చేశారు. క్రమంగా ఈ మొత్తం మరింత పెరగవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో వీరిద్దరిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఫెమా చట్టం ఉల్లంఘన కింద కేసులు నమోదు కావడానికి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.

Also Read: Tata Sierra: ప్రపంచకప్ గెలిచిన టీమిండియా అమ్మాయిలకు TATA సూపర్ గిఫ్ట్.. ప్రతి ఒక్కరికి టాటా సియెరా కారు..!

Also Read: Pm Modi: ఉమెన్స్ వరల్డ్ కప్‌ గెలిచిన మహిళల జట్టును ప్రశంసించిన మోదీ.. ఫొటోలు, వీడియో చూశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News