Fact Check: ఒడిశా బాధితులకు విరాట్, రోహిత్ విరాళంలో నిజమెంత

Fact Check: ఒడిశా రైలు ప్రమాదం దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. రైల్వే వ్యవస్థలోని భద్రతపై ఎన్నో ప్రశ్నల్ని సంధించినా..పోయిన ప్రాణం తిరిగి రాదు. అవయవాలు కోల్పోయి జీవచ్ఛవాలైన బతుకులు గాడిన పడవు. కావల్సిందల్లా ఆర్ధిక చేయూత.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 12:30 PM IST
Fact Check: ఒడిశా బాధితులకు విరాట్, రోహిత్ విరాళంలో నిజమెంత

Fact Check: అందుకే మనసున్న మారాజులు స్పందిస్తున్నారు. బాధితుల్ని ఆదుకునేందుకు విరాళం ప్రకటిస్తున్నారు. మానవత్వం ఇంకా మిగిలే ఉందని చాటుతున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లి, ప్రస్తుత సారధి రోహిత్ శర్మలు బాధితుల్ని ఆదుకునేందుకు ఆర్ధిక సహాయం ప్రకటించారనే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఎంతవరకూ నిజమో పరిశీలిద్దాం.. 

దేశ చరిత్రలో అత్యంత దారుణమైన రైలు ప్రమాదాల్లో ఒకటి ఒడిశా రైలు ప్రమాదం. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 278 మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి గాయాలయ్యాయి. ఎందరో అవయవాలు కోల్పోయారు. వందమందికి పరిస్థితి విషమంగా ఉంది. బతికిన్నోళ్లు జీవచ్ఛవాలైతే పోయినోళ్లు కుటుంబసభ్యుల్ని అనాథలుగా మార్చేశారు. ఈ విషాద ఘటనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఈ ఘటన తనను చాలా కలచివేసిందని బాధిత కుటుంబసభ్యులు కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని..క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అంతేకాకుండా బాధితులకు 30 కోట్లు విరాళం ప్రకటించినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే 30 కోట్ల విరాళంపై అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాలేదు.

మరోవైపు టీమ్ ఇండియా రధసారధి రోహిత్ శర్మ కూడా ఈ ఘటనపై స్పందించి బాధిత కుటుంబీకులకు 15 కోట్లు విరాళం ప్రకటించినట్టు వార్త వైరల్ అయింది. అయితే రోహిత్ శర్మ విరాళం ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. విరాట్ కోహ్లి 30 కోట్ల విరాళం, రోహిత్ శర్మ 15 కోట్ల విరాళంపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఇంకా ఏదీ విడుదల కాలేదు. కానీ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో వివిధ సంఘటనల్లో స్పందించి విరాళం ఇచ్చిన దాఖలాలున్నాయి.

అందుకే ఇప్పుడీ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాల్ని ఆదుకునేందుకు విరాట్ కోహ్లీ 30 కోట్లు, రోహిత్ శర్మ 15 కోట్ల విరాళంపై అధికారికంగా ఏ ప్రకటనా రాలేదు. ఈ క్రమంలో ఈ వార్తల్లో నిజం లేదని తేలుతోంది.

Also read: Prasidh Krishna Engagement: పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రసిద్ధ్ కృష్ణ.. ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News