IPL Uppal Stadium: కొన్ని రోజుల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. ఉప్ప‌ల్ స్టేడియం ఎలా ఉందో చూద్దాం

Few Days To Go IPL 2025 Renovated Uppal Stadium: ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమవుతున్న వేళ ఉప్పల్‌ స్టేడియం సిద్ధమవుతోంది. ఉప్పల్‌ స్టేడియం ఆధునీకరణ పనులపై బీసీసీఐ, హెచ్‌సీఏ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 12, 2025, 11:39 PM IST
IPL Uppal Stadium: కొన్ని రోజుల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. ఉప్ప‌ల్ స్టేడియం ఎలా ఉందో చూద్దాం

Uppal Stadium: క్రీడా రంగంలో ఉర్రూతలూగించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌లు ప్రారంభమవుతుండగా.. ఈ కీలక మ్యాచ్‌లకు ఉప్పల్‌ స్టేడియం ముస్తాబవుతోంది. కొత్త తరహాలో రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం సిద్ధమైంది. గతంలో అసౌకర్యాలు.. మౌలిక సౌకర్యాలు కరువు.. సరైన వసతులు లేకపోవడంతో ప్రేక్షకులతోపాటు వీఐపీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్రికెట్‌ ప్రపంచంలో ఉప్పల్‌ స్టేడియంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బీసీసీఐ రంగంలోకి స్టేడియాన్ని ఆధునీకరించింది. స్టేడియం రూపురేఖలు మారిపోతున్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Team India Facts: టీమ్ ఇండియా గురించి మీకెవ్వరికీ తెలియని అంశాలు, 30 ఏళ్లు దాటినా వాడి తగ్గని ఆటగాళ్లు

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం రూ.5 కోట్ల వ్యయంతో సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఆధునీక‌ర‌ణ ప‌నులు చకచకా జ‌రుగుతున్నాయి. ఈ పనులను హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు, బీసీసీఐ, ఎస్ఆర్‌హెచ్ ప్ర‌తినిధులు మైదానం పనులను పరిశీలించారు. ఉప్ప‌ల్ స్టేడియం ఆధునీక‌ర‌ణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని హైద‌రాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్ రావు తెలిపారు.

Also read: Team India Schedule: టీమ్ ఇండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇంగ్లండ్ సిరీస్ తరువాత రెస్ట్ ఉందా లేదా

స్టేడియాన్ని బీసీసీఐ, ఎస్ఆర్‌హెచ్ ప్ర‌తినిధులు మైదానాన్ని ప‌రిశీలించారు. మ‌రో ప‌ది రోజుల్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌డంతో ప‌నుల్లో వేగం పెంచాల‌ని సిబ్బందిని ఆదేశించారు. స్టేడియం మొత్తం రంగులు వేస్తున్నామ‌ని, నార్త్ స్టాండ్స్‌లో కొత్త  రెస్ట్ రూమ్స్ నిర్మిస్తున్నామ‌ని, క్రికెట‌ర్ల డ్రెస్సింగ్ రూమ్స్‌, కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు, టైల్స్ మారుస్తున్నామ‌ని చెప్పారు. స్టేడియంకు కొత్త రూపు ఇచ్చేందుకు హెచ్‌సీఏ నుంచి సుమారు రూ.5 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని, సీఎస్ఆర్ ప‌థ‌కం కింద ఎస్ఆర్‌హెచ్ కూడా స‌హ‌కారం అందిస్తుంద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రావు తెలిపారు. జ‌గ‌న్ మోహ‌న్ రావుతో పాటు బీసీసీఐ నుంచి వైభ‌వ్‌, యువ‌రాజ్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం నుంచి శ‌ర‌వానణ్‌, రోహిత్ స్టేడియంలో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News