Gujarat Titans Winning Streak: ఐపీఎల్‌లో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అద్భుతాలు చేస్తోంది. వరుసగా మ్యాచ్‌లను సొంతం చేసుకుని అదే జోష్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. భారీ పరుగుల లక్ష్యం విధించి.. అనంతరం బౌలింగ్ అదరగొట్టి ప్రత్యర్థి చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్‌కు తోడు.. ప్రసిద్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్‌తో గుజరాత్ విజయ యాత్ర కొనసాగించింది. రాజస్థాన్‌ను 58 పరుగుల తేడాతో గుజరాత్ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
Also Read: Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు.. ప్లాన్ చేసుకుంటే ఏకంగా ఐదు రోజుల సెలవులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 53 బంతులకు 82 పరుగులు చేశాడు. 3 సిక్సర్లతో 8 ఫోర్లు బాదాడు. శుభమన్ గిల్ 2 పరుగులతో మరోసారి బ్యాటింగ్‌తో నిరుత్సాహపర్చగా.. రూథర్‌ఫోర్డ్ కూడా తక్కువ స్కోర్ చేశాడు. జోస్ బట్లర్, షారూక్ ఖాన్ 36 చొప్పున ఇద్దరు స్కోర్ చేశారు. రాహుల్ తెవాటియా 24 పరుగులు చేయగా.. రషీద్ ఖాన్ 12 కొంత చేశాడు. బౌలింగ్‌లో రాజస్థాన్ కొంత తడబడడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ రెండు వికెట్ల చొప్పున తీయగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: Priyansh Arya Century: పంజాబ్‌కు 'ప్రియ'మైన విజయం.. చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి
ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లకు 159 పరుగులు చేసి కుప్పకూలింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవడంతో తర్వాతి బ్యాటర్లు కూడా అంతగా పోరాడకపోవడంతో రాజస్థాన్ మ్యాచ్‌ను కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 6 పరుగులకే ఔటవగా.. నితీశ్ రానా ఒక్క పరుగు చేశాడు. కెప్టెన్ సంజూ శామ్‌సన్ 28 పరుగులు 41 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ 26 నమోదు చేయగా.. ధ్రువ్ జురేల్ 5 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో షిమ్రాన్ హెట్‌మెయిర్ దుమ్మురేపాడు. 32 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు పరువు నిలిపే ప్రయత్నం చేశాడు. హెట్‌మెయిర్ అనంతరం వచ్చిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో జట్టు పరాజయం వైపు నిలిచిపోయింది. బ్యాటర్లు దుమ్మురేపగా.. గుజరాత్ బౌలర్లు కూడా సంచలన ప్రదర్శన చేశారు. ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు తీసి రాజస్థాన్‌ను భారీ దెబ్బ తీశాడు. మరోసారి ప్లేఆఫ్స్ సిరాజ్ ఒక వికెట్ తీయగా.. రషీద్ ఖాన్, సాయి కిశోర్ తలా రెండు వికెట్లు తీశారు. అర్షద్ ఖాన్, కుల్వంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అగ్రస్థానానికి గుజరాత్
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఫుల్ జోష్‌లో ఉంది. వరుసగా నాలుగో విజయాన్ని తిరుగులేని విజయంతో ఖాతాలో వేసుకుని 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌ను చేజార్చుకుని అనంతరం టైటాన్స్ గొప్పగా పుంజుకుంది. బ్యాటర్‌గా విఫలమవుతున్న శుభమన్ గిల్ కెప్టెన్‌గా విజయం సాధిస్తుండడం విశేషం. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ అద్భుతం చేస్తున్న గుజరాత్ సమష్టి కృషితో టాప్ జట్టుగా దూసుకెళ్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









