IPL 2025: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అరుదైన మైలు రాయికి చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను రషీద్ వెనక్కి నెట్టాడు. ఐపీఎల్‌లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ నిలిచాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ప్రియాంష్ ఆర్యను అవుట్ చేయడం ద్వారా అతను ఈ ఘనతను సాధించాడు.
మిస్టరీ బౌలింగ్ తో ఇరుకున పెట్టే ఈ స్పిన్నర్ 150 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మార్చి 25న నరేంద్రమోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యాను ఔట్ చేసి 150 క్లబ్ లో చేరాడు ఈ అప్ఘనిస్తాన్ సారథి.
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు. ముంబై యార్కర్ కింగ్ కంటే వేగంగా 150 వికెట్లు ఫీట్ సాధించాడు. బుమ్రా 124 మ్యాచుల్లో ఈ మైలురాయికి చేరుకుంటే రషీద్ కేవలం 122 మ్యాచుల్లోనే 6. 86 ఎకానమీతో 150 వికెట్ల క్లబ్ లో చేరిపోయాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తక్కువ మ్యాచుల్లోనే 150 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. వెటరన్ పేసర్ లసిత్ మలింగ 105 మ్యాచుల్లో యజ్వేంద్ర చాహల్118 మ్యాచుల్లో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన జాబితాలో డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నారు. బ్రావో 137 మ్యాచ్‌ల్లో, భువనేశ్వర్ 138 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించారు.
Milestone Accomplished ?
Rashid Khan joins an elite list of bowlers with 1️⃣5️⃣0️⃣ #TATAIPL wickets ?
Can he guide #GT to a win in their season opener? #GTvPBKS | @gujarat_titans | @rashidkhan_19 pic.twitter.com/fYe1rdnA2q
— IndianPremierLeague (@IPL) March 25, 2025
Also Read: Money: 60ఏళ్లు దాటిన వారిని ఈ ప్లాన్‌లో చేర్చండి.. 5 వేల పెన్షన్ వస్తుంది
ఈ మ్యాచ్‌లో రషీద్ పెద్ద ఘనత సాధించినప్పటికీ, అతని జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడిన పంజాబ్, ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 11 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్, శ్రేయాస్ అయ్యర్ శశాంక్ సింగ్ మధ్య 81* భాగస్వామ్యం చేశారు. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్‌లో పంజాబ్‌కు రెండో అత్యధిక స్కోరు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Rashid Khan the Magician ?
The leg-spinner becomes the 3rd fastest to 150 wickets in IPL history ? pic.twitter.com/jr2oWbDqIE
— Cricket.com (@weRcricket) March 25, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









