Hyderabad IPL Match Tickets: కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై అప్పుడే వివాదాలు, ఆరోపణలు, విమర్శలు చుట్టుముడుతున్నాయి. భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యే హైదరాబాద్ మ్యాచ్‌లపై తాజాగా వివాదం మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల టికెట్లన్నీ అమ్ముడుపోయాయని.. అమ్మేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి వెళ్లింది. కొన్ని మాధ్యమాల్లో ఈ వార్తలు ప్రసారం కావడంపై హెచ్‌సీఏ స్పందించింది. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసింది.
Also Read: Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు ముందు కీలక ప్లేయర్ అవుట్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్లకు సంబంధించి తప్పుడు వార్తలు.. అవాస్తవాలు ప్రసారం చేయొద్దని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. ముంబైలో జరిగే మ్యాచ్‌కు సంబంధించి టికెకెట్లు అమ్ముడుపోతే హెచ్‌సీఏకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ టికెట్లను విక్రయించేది బుక్‌మై షోలో కాదని వివరణ ఇచ్చారు. హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు డిస్ట్రిక్ జొమాటో యాప్‌లో ఉంటాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు ప్రకటించారు.
Also Read: Ind vs Nz 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌కు టీమ్ ఇండియాలో మార్పులు ఉంటాయా
'తొలి రెండు మ్యాచ్‌ల టికెట్లు ఇప్పటికీ డిస్ట్రిక్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి' అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. 'మిడిమిడి జ్ఞానం.. సమాచారంతో వార్తలు ప్రసారం చేసి అభిమానులను గందరగోళానికి గురి చేయవద్దు' అని విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై నియంత్రణ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది. కానీ హెచ్‌సీఏది కాదు' అని వివరణ ఇచ్చారు. 'బీసీసీఐ, హెచ్‌సీఏ ఐపీఎల్ ఏర్పాట్లను పరిశీలిస్తుంది కానీ టికెట్లు విక్రయించదు' అని హెచ్‌సీఏ స్పష్టం చేసింది.
'ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రతిష్ఠను మసకబారిస్తే ఉపేక్షించేది లేదు' అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు హెచ్చరించారు. దేశంలోనే హెచ్‌సీఏను ఒక రోల్ మోడల్‌గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 'ఐపీఎల్ టికెట్ల దందా అని హెచ్‌సీఏపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన చానెళ్లకు లీగల్ నోటీసులిస్తాం. కొందరు తప్పుడు సమాచారంతో హెచ్‌సీఏపై బురదజల్లితే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం' అని హెచ్‌సీఏ వెల్లడించింది.
'తక్కువ ధర టికెట్లను విద్యార్థులు, యువతలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి అవి త్వరగా విక్రయమవుతాయి' అని హెచ్‌సీఏ వివరించింది. 'చివరగా టికెట్ల విషయమై ఏమైనా అనుమానులుంటే సన్ రైజర్స్ యాజమాన్యం, సిబ్బంది, జొమాటో యాప్ ప్రతినిధులను సంప్రదించండి' అని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









